తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సాంగ్ విడుదల చేసారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సందర్భంగా మార్చి 26న విడుదలవుతున్న రంగ్ దే మూవీ యూనిట్ కు అభినందనలు తెలియజేసారు. రీసెంట్ గా రంగ్ దే మూవీ నుంచి విడుదలైన రెండు పాటలకు ఇటు మ్యూజిక్ లవర్స్ నుంచి, అటు ఆడియెన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్న తరుణంలో ఈ చిత్రం నుంచి మరో గీతం లిరికల్ వీడియో రూపంలో ఈరోజు విడుదల అయింది. చిత్ర కథ ప్రకారం సందర్భోచితంగా వచ్చే ‘రంగ్ దే’ లోని ఈ గీతం వివరాల్లోకి వెళితే

“నా కనులు ఎపుడూ కననే కనని
హృదయ మెపుడూ విననే వినని
పెదవు లెపుడూ అననే అనని
అద్భుతం చూస్తూ ఉన్నా…”
అంటూ పల్లవితో సాగే ఈ గీతానికి శ్రీమణి లిరిక్స్ అందించారు. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఉప్పెన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన చిత్రమిది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Source: Aditya music

PSPK 28 కోసం రెడీ అవుతున్నారు ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో మూవీ కోసం తాజాగా రంగంలోకి దిగారు. తన కళా ప్రతిభతో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆనంద్ సాయి… ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 5 సంవత్సరాల నుంచి ఏ సినిమాకు కమిటవకుండా తెలంగాణలోని యాదాద్రి శ్రీలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిర్మాణం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. దీంతో మళ్లీ సినిమాలకు వర్క్ చేసేందుకు ఓకే చెప్పారు.
తొలి ప్రేమ‌ నుంచి మొదలుపెడితే త‌మ్ముడు, ఖుషీ , జ‌ల్సా వరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు పనిచేసారు ఆనంద్ సాయి. ఇప్పుడిక హ‌రీష్ శంక‌ర్ డైరెక్షన్లో ప‌వ‌ర్ స్టార్ హీరోగా రూపొందనున్న చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. ఈ కాంబో మూవీని నిర్మించబోయే మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే ఇంత కాలం తర్వాత ఆనంద్ సాయి…తన ఆప్తుడైన పవన్ కళ్యాణ్ సినిమాకు కళా దర్శకునిగా పనిచేస్తుండటం విశేషం. త్వ‌ర‌లోనే సెట్స్ పైకెళ్లనున్న ఈ ప్రాజెక్ట్…ఆనంద్ సాయికి రీఎంట్రీ చిత్రమనే చెప్పొచ్చు.

ఇంతవరకు రొమాంటిక్ సీన్స్ లో అయితే నటించారు కానీ…గాడ అదర చుంబనానికి దూరంగానే ఉన్నారు రవితేజ. కానీ ఇప్పుడా హద్దును చెరిపేసారు. ఖిలాడిగా హీరోయిన్ మీనాక్షి చౌదరి లిప్ లాక్ చేసారు. క్రాక్ హిట్ తో మంచి ఊపుమీదున్న మాస్ రాజా…ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి చిత్రాన్ని చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇందులోనే హాట్ యాంకర్ అనసూయ కూడా కీ రోల్ పోషిస్తున్నారనే వార్తలొస్తున్నాయి. కాగా తాజాగా మీనాక్షి చౌదరికి… ఇంగ్లీష్ ముద్దిచ్చి హాట్ టాపిక్ గా మారారు రవితేజ.
నిజానికి రవితేజ ముద్దాటకి అంగీకరించలేదట. కానీ డైరెక్టర్ రమేశ్ వర్మ బలవంతంగా ఒప్పించి లిప్ లాక్ ఇప్పించారట. తాజాగా రెడ్ మూవీతో రామ్ కూడా లిప్ కిస్ కి తెరలేపారు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు సైతం హీరోయిన్ పెదవిని టచ్ చేసినవాళ్లే. బాలీవుడ్ లో కామన్ అయిపోయిన లిప్ లాక్…ఇప్పుడు టాలీవుడ్ లోనూ హద్దులు చెరిపేస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత జోరు మరింత పెరిగింది. ఇప్పుడిక రవితేజ కూడా లిప్ లైన్లోకి వచ్చేసారు.