67వ జాతీయ అవార్డులను ప్రకటించారు. తెలుగులో ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’ చిత్రం చోటు సంపాదించుకుంది. ఉత్తమ హిందీ చిత్రంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా వచ్చిన ‘చిచ్చోరే’ ఎంపికైంది. కాగా మిగిలిన విభాగాల్లో బెస్ట్ కొరియోగ్రఫీ ‘మహర్షి’ సినిమాకి గానూ రాజు సుందరం, బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో ‘జెర్సీ’ సినిమాకి ఎడిటర్ నవీన్ నూలి, పాపులర్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రంగా ‘మహర్షి’ సినిమాలు నేషనల్ అవార్డును దక్కించుకున్నాయి. మొత్తంగా చూస్తే తెలుగులో మహర్షికి రెండు, జెర్సీకి రెండు నేషనల్ అవార్డులు దక్కాయి.

ఇక ‘అసురన్’ చిత్రానికి గానూ ధనుష్ జాతీయ ఉత్తమ నటుడిగా… ‘మణికర్ణిక’, ‘పంగా’ సినిమాలకు గానూ కంగనా రనౌత్ జాతీయ ఉత్తమనటిగా అవార్డును సంపాదించారు. అలాగే ‘సూపర్ డీలక్స్’ సినిమాలో అద్భుత నటన ప్రదర్శించిన విజయ్ సేతుపతి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డ్ వరించింది. బెస్ట్ మ్యూజిక్ ఫర్ సాంగ్స్ విభాగంలో అజిత్ నటించిన ‘విశ్వాసం’, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో ‘జల్లికట్టు’ చిత్రానికి అవార్డు దక్కింది.

రాధేశ్యామ్ రిలీజ్ డేట్ జూలై 30 అని ప్రకటించడంతో ఆలోచనలో పడ్డారు వరుణ్ తేజ్ గని మేకర్స్. మరి జూలై 30నే వరుణ్ తేజ్, ప్రభాస్ పోటీపడుతారా..లేదంటే వరుణ్ వెనక్కి తగ్గుతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏప్రిల్ 9న రిలీజ్ డేట్ ప్రకటించిన వకీల్ సాబ్ తో పోటీపడేందుకు సిద్ధమయ్యారు తమిళ్ స్టార్ ధనుష్. ఈ హీరో నటించిన కర్ణన్ మూవీని సైతం మల్టీ లాంగ్వేజేస్ లో ఏప్రిల్ 9వ తేదీనే విడుదల చేస్తున్నారు మేకర్స్. అలాగే గోపీచంద్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సిటీమార్ రిలీజ్ డేట్… ఏప్రిల్ 2పైనే కన్నేసారట నాగార్జున. అదేరోజున నాగ్ నటించిన వైల్డ్ డాగ్ సైతం విడుదలకు రెడీఅయినట్టు టాక్ వినిపిస్తోంది.

నిజానికి పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, గోపీచంద్ సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడో ప్రకటించారు దర్శకనిర్మాతలు. కొత్తగా ఇవే డేట్స్ పై కర్చీఫ్ వేసారు ధనుశ్, ప్రభాస్, నాగార్జున సినిమాల దర్శకనిర్మాతలు. ఈ పోటీని చూస్తుంటే ప్రభాస్ రాధేశ్యామ్ ని తలపడకుండా వరుణ్ తేజ్ గని వెనక్కి తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ వకీల్ సాబ్, కర్ణన్ సినిమాలూ…సీటీమార్, వైల్డ్ డాగ్ సినిమాలకి మాత్రం పోటీ తప్పేలా కనిపించడం లేదు. చూద్దాం…ముందు ముందు ఏం జరుగబోతుందో….

కార్తీ కాకుండా ధనుష్ ని యుగానికి ఒక్కడు పార్ట్ 2 లో హీరోగా ప్రకటించి సంచలనం సృష్టించారు డైరెక్టర్ సెల్వ రాఘవన్. అయితే దానికో మంచి కారణమే ఉందంటున్నారు ఇప్పుడు. 2010లో ‘ఆయిరతిల్ ఒరువన్..’ పేరుతో కోలీవుడ్ లో…యుగానికి ఒక్కడుగా టాలీవుడ్ లో హిట్ కొట్టారు డైరెక్టర్ సెల్వ రాఘవన్.
మళ్ళీ పదేళ్ల తర్వాత దీనికి పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారని తెలియడంతో అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. కొత్త ఏడాదిలో అడుగిడగానే సెల్వ రాఘవన్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సైతం సూపర్ వైరల్ అవుతోంది. అయితే.. ఈ సీక్వెల్ లో ఫస్ట్ పార్ట్ లో నటించిన కార్తీకి బదులు ధనుష్ ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యుగానికి ఒక్కడు కోసం అప్పట్లో కష్టపడిన కార్తీని కాదనుకోవడం మంచి పద్ధతి కాదనే వేడి వేడి చర్చలు జరిగాయి. అయితే అన్నింటికి ఓ ఇంట్రెస్టింగ్ సమాధానంతో ఫుల్ స్టాప్ పడింది.
కథ ప్రకారమే ధనుష్ ను సెలెక్ట్ చేసారట డైరెక్టర్. ‘యుగానికి ఒక్కడు’ మూవీ క్లైమాక్స్ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడే ఈ సీక్వెల్ మొదలవుతుందని చెబుతున్నారు. తొలి పార్ట్ లో హీరో కార్తీ చోళ యువరాజైన ఓ బాలుడిని పాండ్యుల నుంచి కాపాడి భుజాన వేసుకొని అడవుల్లోకి వెళ్తాడు కదా. ఆ పిల్లోడే ఇప్పుడు ధనుష్ రూపంలో పెరిగి పెద్దవాడు అవుతాడట. ఆ బాలుడి పాత్రలోనే హీరో ధనుష్ కనిపించనున్నాడట.


ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఉంది. మొదటి భాగంలో హీరో కార్తీదే లీడ్ రోల్. మరి అలాంటి పాత్రను ఇందులో ఎలా ముగిస్తున్నారనేది కీలకంగా మారింది. ఎలాంటి ట్విస్టుతో ఈ పాత్రను ఎండ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కానీ అది తెలుసుకోవాలంటే 2024 వరకు ఆగాల్సిందే. అప్పుడే ఈ ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధమవుతుందట.
‘ఆయిరతిల్ ఒరువన్-2’ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. అరవింద్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ను కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.