జనవరి 1న సోషల్ మీడియా అకౌంట్లన్నింటిని ఖాళీ చేసింది దీపికా పదుకోన్. 2020 ఛేదు జ్ఞాపకాలను మర్చిపోయి 2021ని ఫ్రెష్ గా స్టార్ట్ చేసేందుకే ఆ పని చేసానని ఓ ఆడియో బైట్ ను రిలీజ్ చేసింది దీపికా. భర్త రణ్ వీర్ సింగ్ తీసిన జైపూర్ టూర్ ఫోటోను రీసెంట్ గా ఇన్ స్టాలో షేర్ చేసింది. 

ఇక ధూమ్ ఫ్రాంచైజ్ ధూమ్4 లో దొంగగా దీపికా పదుకోన్ నటించే అవకాశం ఉంది. ఈ విషయమై యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే దీపికాను సంప్రదించినట్టు తెలుస్తోంది. క్రేజీగా దొంగతనాలు చేసే గజదొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీసుల కథాంశంతో ధూమ్ సిరీస్ తెరకెక్కాయి. అన్నీ సూపర్ హిట్ గా నిలిచినవే. మూడింటిలోనూ అభిషేక్ బచ్చన్ లీడ్ పోలీసాఫీసర్ గా నటిస్తే జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ దొంగలుగా మెప్పించారు. అయితే కాస్త డిఫరెంట్ గా ఈసారి లేడీ దొంగను ప్రవేశపెట్టానున్నారట. అందుకోసమే దీపికాను దొంగగా మారమని నిర్మాతలు అడిగినట్టు తెలుస్తోంది. మరి దీపికా సమాధానమెంటో త్వరలోనే తెలియనుంది.