దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి పుట్టినరోజు ఫోటోలు బాగా వైరలవుతున్నాయి. రీసెంట్ గా బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకున్న హన్షిత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. గాలిలో చార్టర్డ్ ఫ్లైట్ లో కూతురు జన్మదిన వేడుకలను జరిపారు దిల్ రాజు. కూతురుని చంటి పాపలా చూసుకునే దిల్ రాజు…ఆమె 30వ పుట్టినరోజును గ్రాండ్ గా జరిపేందుకు ఒక చార్టర్డ్ ఫ్లైట్ ను బుక్ చేసి… ఆ ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన తర్వాత గగన వీధుల్లోనే బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. దిల్ రాజుతో పాటూ ఆయన భార్య కూడా ఆనందంగా వేడుకలో పాల్గొన్నారు. అటు హన్షిత భర్త, పిల్లలు సైతం ఉత్సాహంగా ఎంజాయ్ చేసారు. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా ఒక రిసార్ట్ కి వెళ్లి పార్టీ చేసుకున్నారు.