స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టార్ సుకుమార్ హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ గురించి ప్రతిరోజూ ఏదో ఒక న్యూస్ సెన్సెషన్ కావాల్సిందే. ఇప్పుడు కొత్తగా ఇందులోని స్పెషల్ సాంగ్ గురించి రచ్చ జరుగుతుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో కథకి తగ్గట్టు ఓ ఫోక్ బీట్ తో ఐటమ్ నంబర్ ని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ పాటలో స్టెప్పులేసేందుకు బాలీవుడ్ సోయగం దిశాపటానీని సంప్రదించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా దిశ రూ.1.5 కోట్లు డిమాండ్ చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

సుకుమార్ సినిమా అంటే దాదపు ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. అది సూపర్ హిట్ కావాల్సిందే. ఆర్యలో అ అంటే అని మొదలెట్టి రింగ రింగ, డియాలో డియాలా అనిపించిన సుక్కు…మొన్నటికి మొన్న పూజాహెగ్దేని జిగేలు రాణిగా ప్రెజెంట్ చేసాడు. ఇక ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ దిశా పటానీతో పుష్పలో డాన్స్ చేయిద్దామంటే అమ్మడు అటకెక్కి కూర్చుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడిన పుష్ప షూటింగ్…త్వరలోనే అరకులో మొదలుకానుంది. మరి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఆ ఫోక్ పెప్పీ పాటలో ఎవరు కనిపిస్తారో చూడాలి.