డా.రాజశేఖర్ హీరోగా మరో సినిమా పట్టాలెక్కనుంది. మర్మాణువు పేరుతో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి డిఫరెంట్ సినిమాలను రూపొందించిన దర్శకుడు వెంకటేష్ మహా. ఇప్పుడీ డైరెక్టర్ తో రాజశేఖర్ సినిమా అది కూడా మర్మాణువు అన్న డిఫరెంట్ టైటిల్ తో అనగానే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి తో పాటూ మహాయాన మోషన్ పిక్చర్స్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రవీణ పరుచూరితో కలిసి రాజశేఖర్, జీవిత కుమార్తెలు శివాని, శివాత్మిక ప్రొడ్యూస్ చేయనున్నారు.

డైరెక్టర్ వెంకటేష్ మహా పుట్టినరోజు సందర్భంగా… సినిమా అదికారికంగా ప్రకటించడంతో పాటు చిత్రానికి ‘మర్మాణువు’ పేరును ఫిక్స్ చేసినట్టు నిర్మాతలు అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు మరిన్ని వివరాలతో పాటు చిత్రీకరణ ప్రారంభమయ్యే తేదీలను త్వరలో వెల్లడిస్తామ ని శివాని, శివాత్మిక, విజయ ప్రవీణ పరుచూరి తెలియజేసారు.