రామ్ చరణ్ ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ రవితేజ చేతిలోకి వెళ్లింది. డైరెక్టర్ జూనియర్‌ లాల్ 2019లో తెరకెక్కించిన మలయాళీ సూపర్ హిట్‌ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’. ఈ మూవీ తెలుగు రీమేక్‌ రైట్స్ కొంత కాలం క్రితమే హీరో రామ్‌చరణ్‌ సొంతం చేసుకున్నారు. కాగా ఈ రీమేక్‌లో విక్టరీ వెంకటేష్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌లు నటిస్తారని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ లో రవితేజ హీరోగా కనిపించనున్నారనే టాక్‌ ప్రస్తుతం వైరల్ గా మారింది.
మాస్ రాజాతో పాటూ మరో ప్రధాన పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి నటిస్తారట. ఈ సంగతిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిఉంది. ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న ‘ఖిలాడి’ మే 28న రిలీజ్ కానుంది. ఆ తర్వాత త్రినాథ్ రావు నక్కిన తో కలిసి పనిచేయనున్నాడు. ఇందులోనే హీరోయిన్ గా జాతిరత్నాలు ఫేం ఫరియా ఎంపికైందనే వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ మొదలెట్టే ఛాన్స్ ఉంది.

ఎప్పటినుంచో బాబాయ్ పవన్ – అబ్బాయ్ చరణ్ కలయికలో ఓ మూవీ ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే ఇప్పుడది నిజం కాబోతుందనే సమాచారం అందుతోంది. తాజాగా మలయాళ బ్లాక్ బస్టర్ డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రైట్స్ ను పోటీపడి మరీ దక్కించుకున్నారట రామ్ చరణ్. ఈ మూవీ రీమేక్ లోనే బాబాయ్ పవన్ కల్యాణ్ తో కలిసి నటించబోతున్నాడట.
సింపుల్ కాన్సెప్ట్ తో డ్రైవింగ్ లైసెన్స్ తెరకెక్కినా…మలయాళంలో మంచి సక్సెస్ సాధించింది. విమర్శకుల ప్రశంలసందుకున్న ఈ మూవీలో పృధ్వీరాజ్, సూరజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక తెలుగులో పృధ్వీరాజ్ రోల్ ను చెర్రీ…సూరజ్ పాత్రను పవర్ స్టార్ పోషిస్తున్నట్టు చెబుతున్నారు. ఇదే గనక నిజమైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పవన్ కల్యాణ్ ను చూడొచ్చు. చూద్దాం అఫీషియల్ ప్రకటన ఎప్పుడొస్తుందో…?