అమెజాన్ ప్రైమ్ లో తాజాగా రిలీజై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది మలయాళ దృశ్యం – 2. మోహన్ లాల్, మీనాతో పాటూ సేమ్ కాస్ట్ ని రిపీట్ చేసి ఈ సీక్వెల్ ను తీసుకొచ్చాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఇంట్రెవెల్ బ్యాంగ్ ముందు నుంచి క్లైమాక్స్ వరకు తన స్క్రీన్ ప్లే ట్విస్ట్ లతో మాయచేసాడు. ఈ మాయకే పడిపోయి వెంకీ ఈ చిత్రానికి కూడా సై అన్నాడని తాజాగా ఆహాచిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలుగులో రెండవ దృశ్యానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వెంకటేశ్, మీనా ప్రధానపాత్రల్లో సేమ్ తారాగణాన్ని రిపీట్ చేస్తూ దృశ్యం తెలుగు సీక్వెల్ మార్చి 1నే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఒరిజనల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్షన్లో మార్చి 5 నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేసారని టాక్. ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ దక్కించుకున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుగులో దృశ్యం – 2ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.