నందమూరి బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ బిబి3 పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. పవర్‌ ప్యాక్డ్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో యాక్టర్ శ్రీకాంత్‌ నటించబోతున్నారు. ఈ సినిమాలో ఆయన ఓ ప్రధానపాత్ర చేస్తున్నారు. శ్రీకాంత్‌ పుట్టినరోజు ప్రత్యేకంగా విషెస్‌ తెలియజేస్తూ తాజాగా మూవీయూనిట్ ఓ పోస్టర్‌ షేర్ చేసింది. అయితే ఇందులో శ్రీకాంత్ చేస్తున్నది ప్రతినాయకుడి పాత్రా…మరేదైనా అన్నది తెలియాల్సిఉంది. ఇంతకుముందు బోయపాటి దర్శకత్వంలో ‘సరైనోడు’ సినిమాలో నటించారు శ్రీకాంత్. ఇప్పుడు మరోసారి ఆయన డైరెక్షన్లో బాలయ్యతో చేయబోతున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యాజైశ్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా పూర్ణ మరో పాత్రలో కనిపించనుంది. సమ్మర్ కానుకగా మే 28వ తేదీన థియేటర్స్ కి రానుందీ సినిమా.