‘ఏక్‌ థా టైగర్, టైగర్‌ జిందా హై’ సినిమాల తర్వాత మరోసారి కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏజెంట్‌ టైగర్‌గా మేకప్ వేసుకోనున్న సంగతి తెలిసిందే. టైగర్‌ సిరీస్ లో వస్తోన్న మూడో సినిమా ‘టైగర్‌ 3’. డైరెక్టర్ మనీష్‌ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్ లో కత్రినా కైఫ్‌ హీరోయిన్. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది.
సీరియల్ కిస్సర్ ఇమ్రాన్‌ హష్మీ టైగర్3లో విలన్‌గా నటింటబోతున్నారు. కండలవీరుడిని ఢీకొట్టే క్రూరమైన ప్రతినాయకుడిగా ఇమ్రాన్‌ రోల్ ఉంటుందట. వచ్చే మార్చి నెలలోనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసారు. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్‌ తర్వాత దుబాయ్‌ లో మిగిలిన భాగాన్ని చిత్రీకరించనున్నారు మేకర్స్. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో టైగర్ 3ను నిర్మించనుంది యశ్ రాజ్ ఫిల్మ్స్.