ఎఫ్…వెంకీ, వరుణ్ కెరీర్లో మర్చిపోలేని సినిమా. డైరెక్టర్ అనిల్ రావిపూడిని స్టార్ ని చేసిన సినిమా. వెండితెరపై కాసులవర్షం కురిపించిన ఈ సినిమా సీక్వెల్ ఎఫ్3 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఎఫ్2 మూవీ రీమేక్ హక్కులను ఎప్పుడో దక్కించుకున్నారు బోనీకపూర్. త్వరలోనే పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అనీజ్ బాజ్మీ డైరెక్ట్ చేయబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్రలో అర్జున్ కపూర్ నటిస్తాడు. అయితే తెలుగులో వెంకటేశ్ చేసిన పాత్ర కోసం సెర్చింగ్ లో ఉన్నారు టీమ్. అలాగే హీరోయిన్స్ ను కూడా ఫైనల్ చేసే పనిలోఉంది మూవీయూనిట్. అన్నీ కుదిరినవెంటనే అధికారికంగా ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు బోనీకపూర్.

సమ్మర్ లో రిలీజ్ కానున్న ఎఫ్ 3 మూవీలో వెంకీ, వరుణ్ లతో పాటూ మరో హీరో కూడా సందడి చేస్తారన్న వార్త కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతుంది. సినిమా ప్రారంభానికి ముందు మహేశ్‌ బాబు, రవితేజ కనిపిస్తారని వార్తలొచ్చాయి. అయితే ముహూర్తం రోజున అనిల్ రావిపూడి అలాంటిదేమి లేదని క్లారిటీ ఇవ్వడంతో వారి పేర్లు మళ్లీ వినబడలేదు. కానీ మళ్లీ మొన్న గోపీచంద్‌ అన్నారు. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ ఫిక్స్ అయ్యారనే వార్త బాగా వైరలయింది. అయితే తాజాగా ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు అనిల్ రావిపూడి. ఎఫ్ మూవీలో మరో హీరోకి అవకాశమే లేదని…మూడో హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరని క్లారిటీ ఇచ్చారు. నిజానికి తాను అనుకున్న కథలో మూడో హీరోకు ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. సేమ్ టు సేమ్ ఎఫ్ 2 లాగానే ఎఫ్ 3 కూడా వెంకీ, వరుణ్ లతో మాత్రమే తెరకెక్కిస్తానని తెలియజేసారు. కాగా దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2021 సమ్మర్ కానుకగా విడుదలవుతుందని ప్రకటించారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రాజేంద్ర ప్రసాద్ ప్లేస్ లో సునీల్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఎఫ్ 2లో భార్యల మనస్తత్వానికి తోడూ రాజేంద్రప్రసాద్ జతై సినిమా ముందుకు సాగుతుంది. అయితే ఎఫ్ 3లో డబ్బు వలన ఫ్యామిలో ఇబ్బందులు తలెత్తి…వీళ్లకి సునీల్ జతై సినిమాలో ఫన్ క్రియేట్ అవుతోందని తెలుస్తోంది. కాన్సెప్ట్ పోస్టర్ లో డబ్బునే ప్రధానంగా హైలైట్ చేసి విషయాన్ని చెప్పకనే చెప్పేసారు అనిల్ రావిపూడి. చూద్దాం ఈ వేసవిలోనే రిలీజ్ కానున్న ఎఫ్ 3 ఎలా సందడి చేస్తుందో….

ఎఫ్ 2 తో అంచనాలు మించి రికార్డ్ హిట్ అందుకున్న ఎఫ్ 2 మూవీ 2019 సంక్రాంతికి రాగా…ఇంటికొచ్చిన కొత్త అల్లుళ్లలా సరదా చేసి ప్రతిఇంటి ప్రేక్షకులను అలరించారు వెంకీ, వరుణ్. ఇక ప్రస్తుతం సెట్స్ పైనున్న ఎఫ్ 3 2021 దసరా కానుకగా వచ్చేందుకు ముస్తాబవుతుంది. అయితే ఎఫ్2కి, ఎఫ్3కి చాలా విషయాల్లో తేడా వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి వెంకీ, వరుణ్ తేజ్ వంటి స్టార్ కాస్ట్ భారీ రెమ్యూనిరేషన్ అందుకుంటుంది ఎఫ్ 3కి. అలాగే సునీల్, బొమాన్ ఇరానీ వంటివారు అదనపు ఆకర్షణగా కనిపించనున్నారు. దీంతో ఈ మూవీ బడ్జెట్ 70కోట్ల రూపాయలవుతుందని ఓ అంచనా.
ఎంతైతే ఖర్చుపెడుతున్నారో…అంతకు మించి రాబట్టుకోబోతున్నారు నిర్మాత దిల్ రాజు. లో బడ్జెట్ లో నిర్మించిన ఎఫ్ 2…బాక్సాఫీస్ ని కొల్లగొట్టి కాసులు రాల్చింది. అంతేనా ఎఫ్ 3పై భారీగా అంచనాలను పెంచేసింది. దీంతో ఎలాగూ ప్రీ బిజినెస్ బాగా జరుగుతుందనే నమ్మకం ఉంది. ఇక తాజాగా ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఎఫ్3 డిజిటల్ రైట్స్ రికార్డ్ రేటులో అమ్ముడయింది. అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేట్ కి ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. డిజిటల్ రైట్సే ఇంత మంచి రేటుకి పోతే సినిమా బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం ఖాయమంటున్నారు సినీజనాలు.