ఆ ఇద్దరితో నటిస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉందంటున్నారు సమంతా అక్కినేని. వారేవరో కాదు నయనతార, విజయ్ సేతుపతి. అయితే సూపర్ డీలక్స్ సినిమాలో సామ్, విజయ్ సేతుపతి నటించినా వీళ్లిద్దరికీ కాంబినేషన్ సీన్స్ లేవు. దీంతో ఆ కల…కలలానే మిగిలింది. ఇప్పుడిక జాక్ పాట్ కొట్టినట్టు తన ఫేవరేట్స్ నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఒకే సినిమాలో నటిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సమంతా.

బిజీబిజీగా అయితే ఉన్నారు కానీ పెద్దగా సినిమాలు అంగీకరించట్లేరు సామ్. ధి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం నయన్ లవర్ విఘ్నేశ్ శివన్ సినిమాతో పాటూ గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న శాకుంతలం ప్రాజెక్ట్స్ లాక్ చేసారు సామ్. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ్ మూవీలోనే పవర్ ఫుల్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతితో పాటూ నయనతారతో కలసి నటిస్తున్నారు సమంత. ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ మూవీతో తీరుతుందని అంటున్నారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2 సిరీస్ తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు సమంతా. నిజానికి ఫిబ్రవరి 12వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సరికొత్త సిరీస్‌ రిలీజ్‌ కావాల్సిఉంది. అయితే నిన్నటివరకు ఎలాంటి వాయిదా లేదని ప్రకటించిన మేకర్స్…హఠాత్తుగా ఈ సిరీస్ ను సమ్మర్ కి వాయిదా వేస్తున్నట్టు చెప్పేసారు. డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే రూపొందించిన సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ మొదటిభాగంలో మనోజ్‌ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించగా…సేమ్ అదే కాంబినేషన్ సెకండ్ సీజన్ లోనూ రిపీట్ అవుతోంది. కాగా టాలీవుడ్ క్వీన్ సమంత విలన్‌ పాత్రలో టెర్రరిస్ట్ గా కనిపించబోతున్నారు.

ఇంతవరకు సామ్ కి సంబంధించిన పార్ట్ ని చాలా గోప్యంగా ఉంచింది యూనిట్. డైరెక్ట్ స్క్రీన్ మీదే సర్ప్రైజ్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇక ఈ సిరీస్ వాయిదా గురించి డైరెక్టర్స్ మాట్లాడుతూ – ‘ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని తెలుసు. మీ అందరికీ ఓ సరికొత్త అనుభూతిని అందించాలనే విడుదలను వేసవికి వాయిదా వేసాం’ అని అన్నారు. అయితే రీసెంట్ గా ఓటీటీ ప్రైమ్‌లో రిలీజైన ‘మిర్జాపూర్‌’, ‘తాండవ్‌’ సిరీస్‌లు వివాదాల్లో చిక్కుకుని…దేశవ్యాప్త చర్చని రేకెత్తించాయి. అందుకే ‘ఫ్యామిలీ మ్యాన్‌’ విషయంలో అలాంటివి ఎదురుకాకూడదనే ఆలోచనతోనే ఇలా ఫిబ్రవరి 12 నుంచి వేసవికి వాయిదా వేసారని టాక్.

అక్కినేని కుటుంబానికి అసలైన కోడలుగా…మామకు తగ్గ కోడలుగా పేరు తెచ్చుకుంటున్నారు సమంతా. నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని ఫ్యామిలీలో భాగమైన సమంతా…మ్యారేజ్ తర్వాత బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఓ వైపు తన కెరీర్ కొనసాగిస్తూనే…తన ఫ్యామిలీ కోసం కావలిసినంత కష్టపడుతున్నారు. ఆస్తుల విషయంలో చైతూను మించినా..ఎన్నడూ శృతిమించలేదు. నటనతో పాటూ యాంకరింగ్, యాడ్స్, వెబ్ సిరీస్, బిజినెస్ ఇలా తనకు చేతనైనంత కూడబెట్టడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు.

ఓవైపు భర్త నాగచైతన్య విజయం కోసం శ్రమిస్తూనే…తాజాగా మరిది అఖిల్ సక్సెస్ కోసం బాధ్యతను ఎత్తుకున్నారు. అందులో భాగంగానే తాను వర్క్ చేసిన ఫ్యామిలీ మెన్ -2 డైరెక్టర్లకి అఖిల్ ని రిఫర్ చేసారని తెలుస్తోంది. తెలుగులో ఢీ ఫర్ దోపిడి సినిమా చేసి సక్సెస్ కాలేదు కానీ ఫ్యామిలీ మెన్ సిరీస్ తో ఆకట్టుకుంటున్నారు రాజ్, డికె. వీరిప్పుడు పాన్ ఇండియా వైడ్ ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా హీరోగా అఖిల్ అయితే బాగుంటాడని సామ్ ఒప్పించారని టాక్.

ఇక, సామ్‌… వెబ్‌ సిరీస్‌ ఫ్యామిలీ మెన్‌ -2 అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో రిలీజ్ కి రెడీఅయింది. జనవరి 19న విడుదలకాబోతున్న ట్రైలర్ కోసం జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో సామ్ విలన్ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. ఓ టెర్రరిస్ట్ గా సమంతా నటించిందని చెబుతున్నారు. అందుకే ట్రైలర్ తో పాటూ రివీల్ కాబోతున్న సామ్ లుక్ కోసం అందరిలో ఇంట్రెస్ట్ పెరిగింది