క్రాక్ ఇచ్చిన ఊపుతో మంచి జోష్ మీదున్నారు మాస్ మహారాజ రవితేజ. ప్రస్తుతం రమేశ్ వర్మ డైరెక్షన్లో ఖిలాడి చిత్రం చేస్తున్న ఆయన..తన నెక్ట్స్ సినిమాకి కూడా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 13న రవితేజ, త్రినథ రావు నక్కిన సినిమా ప్రారంభం కానుందని సమాచారం. రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం మే రెండో వారంలో ప్రారంభిస్తారట. కాగా సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేయనున్నారు. ఇప్పుడు నటిస్తోన్న ఖిలాడిలోనూ రెండు పాత్రల్లో కనిపించనున్నారు రవితేజ.

ఇదిలాఉంటే త్రినథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడని టాక్. జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా, పెళ్లిసందడి2 ఫేం శ్రీలీలతో పాటూ లవ్లీసింగ్ సైతం మాస్ రాజా సరసన ఎంపికైంది. ముగ్గురు భామలతో రవితేజ పండించే కామెడీ, రొమాన్స్ ఓ లెవల్లో ఉంటుందని చెప్తున్నారు మూవీ మేకర్స్.

అనుష్క సరసన నటించే ఛాన్స్ కొట్టేసాడట హీరో నవీన్ పొలిశెట్టి. డైరెక్టర్ మహేశ్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి డిఫరెంట్ లవ్ స్టోరిని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10ఏళ్ల వయసు తేడా ఉన్న ఓ ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో రారా కృష్ణయ్య ఫేం మహేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

బంపర్ ఆఫర్ అందుకున్నాడట జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్. ఓ మాస్ మసాలా కథతో హీరో రామ్ ను టెంప్ట్ చేసినట్టు టాక్. కథ విన్న రాన్ వెంటనే అనుదీప్ కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్, స్రవంతి మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని టాక్.

భలే ఛాన్స్ కొట్టేసింది జాతిరత్నాలు ఫేం ఫ‌రియా అబ్ధుల్లా. ఇప్పటికే ఈ అమ్మాయికి వరుస ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాటయి. కాగా మాస్ రాజా రవితేజ, త్రినాథ రావు నక్కిన కాంబినేషన్ సినిమాలో ఫరియాకు ఛాన్స్ ఇస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న ఖిలాడి అయినవెంటనే పట్టాలెక్కబోతున్న త్రినథరావు చిత్రంలో ఫరియానే హీరోయిన్ గా సెట్టయ్యే అవకాశం ఉంది

కంటెంట్ ఉంటే చిన్నా, పెద్దా తేడా లేదు…సినిమా ఎలాంటిదైనా లాభాల వర్షం కురిపిస్తాయి. ఎంతో రిస్క్ చేసి, డబ్బులు కూడబెట్టుకొని, ఫైనాన్స్ చేసి , కమర్షియల్ హంగులన్నీ కూర్చి కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కించినా…చివరికి నిర్మాతల చేతులు కాలిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాని అతి తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు… ప్రొడ్యూసర్స్ ను లాభాల బాట పట్టించాయి. ఇప్పుడలాగే జాతిరత్నాలు సినిమా టాలీవుడ్ దర్శకనిర్మాతల నోళ్లతో నానుతుంది.

నిజానికి జాతిరత్నాలు కథ అంత కొంతదేమి కాదు. కానీ సున్నితమైన హాస్యాన్ని నమ్ముకున్న డైరెక్టర్ అనుదీప్..దాంతోనే మాయ చేసాడు. లాజిక్స్ పట్టించుకోకుండా ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా ప్లాన్ చేసాడు. నవీన్, రాహుల్, ప్రియదర్శి నటన ఈ సినిమాకి హయ్యెస్ట్ సెల్లింగ్ పాయింట్. మొత్తానికి సక్సెస్ అయ్యారు. అయితే ఈ డైరెక్టర్ పిట్టగోడ అనే సినిమా కూడా చేసాడు. కానీ అది ఎప్పుడు వచ్చిందో, పోయిందో కూడా ఎవరికి తెలియదు. కానీ వైజయంతీ బ్యానర్, నాగ్ అశ్విన్ వంటివారు జాతిరత్నాలను చలా ట్రెండీగా జనాల్లోకి తీసుకెళ్లారు.
వైజయంతీ సంస్థ నిజానికి కేవలం 3, 4 కోట్ల పరిమిత బడ్జెట్ లో రూపొందించింది జాతిరత్నాలు సినిమాని. అమ్మకుండానే అడ్వాన్స్ ల మీద మాత్రమే డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చేసింది. ఆశ్చర్యంగా పది కోట్లకు పైగా అడ్వాన్స్ లు వచ్చాయని సమాచారం. కాగా తొలి రోజు రాబట్టిన వసూళ్లు 4 కోట్లకు పైగా ఉంటాయని ఓ అంచనా. అంటే మొదటి వారాంతంలోనే అడ్వాన్సులు చెల్లిపోతాయి. ఉక కమీషన్లు కూడా పోయినా మంచి లాభాలను కట్టబెట్టనున్నారు జాతిరత్నాలు. మొత్తంగా చూస్తే 3, 4కోట్ల పెట్టుబఢికి నాలుగింతల షేర్ లాభం వస్తుందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇంకా డిజిటల్ రైట్స్, టీవీ రైట్స్ వేరే ఉన్నాయి. ఇలా ప్రతిదీ లెక్క లేసుకుంటే జాతిరత్నాలు గ్రాండ్ హిట్ అన్నట్టే.