సంక్రాంతి సీజన్ తర్వాత ప్రేమికుల దినోత్సవాన్ని టార్గెట్ చేసాయి కొత్త చిత్రాలు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా రెండురోజుల ముందుగానే ‘ఫిబ్రవరి 12’ నుంచే సందడి చేసేందుకు క్యూ కట్టాయి కొన్ని సినిమాలు ఒకేరోజు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసాయి.
‘ఉప్పెన’ ఎన్నో నెలలుగా రిలీజ్ కోసం కాచుకూర్చున్న సినిమా ఇది. మెగా ఫ్యామిలి హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా కావడం…పాటలు సూపర్ డూపర్ హిట్టవడంతో మంచి అంచనాలే ఉన్నాయి ఈ సినిమా మీద. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కరోనా కారణంగా గతేడాది వాయిదాపడింది. ఓటీటీ ఆఫర్ వచ్చినా వద్దనుకున్నారు. థియేటర్లోనే రిలీజ్ చేసేందుకు వెయిట్ చేసి ఫిబ్రవరి 12న వచ్చేందుకు రెడీఅయ్యారు.
‘ఉప్పెన’తో పాటే ఫ్యామిలీ హీరో కమ్ విలన్ జగపతిబాబు నటించిన ‘FCUK’ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ జనాల్ని బాగానే అట్రాక్ట్ చేస్తోంది. ఇక వీటితో పాటూ యాక్షన్ హీరో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన టెక్నికల్ థ్రిల్లర్ ‘చక్ర’, ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘శశి’ సినిమాలు సైతం ఫిబ్రవరి 12నే వచ్చేందుకు ముహూర్తం పెట్టుకున్నాయి.

రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఎఫ్‌సీయూకే’లో తండ్రిగా నటిచిన జగపతిబాబు సోషల్ మీడియాలో ఏసుక్రీస్తుగా కనిపిస్తున్నారు. ట్విట్టర్ లో యాక్టివ్‌గా ఉండే జగ్గూభాయ్ త‌న సినిమా విశేషాల‌ను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటారు. రీసెంట్ గా చేతుల‌కు శిలువ‌, నెత్తిన ముళ్లకిరీటం, బక్కచిక్కిన శరీరంతో ట్విట్టర్ లో దర్శనమిచ్చారు. అయితే ఈ ఫోటోతో పాటూ ఎలాంటి కామెంట్ చేయలేదు. ఏదైనా సినిమాలో ఏసుగా నటిస్తున్నారా…వేరే కారణం ఏదైనా ఉందా అన్నది అభిమానులకి అర్ధం కావట్లేదు. దీంతో క్లారిటీ ఫ్లీజ్ స‌ర్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఒక‌ప్పుడు ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌ని టార్గెట్ చేసిన జ‌గ‌ప‌తి బాబు వివిధ రకాల క్యారెక్టర్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. విలన్ గా, అన్నయ్యగా, తండ్రిగా… ఇలా ప్రత్యేకమైన పాత్ర‌లు చేస్తూ కాల్ షీట్స్ ఖాళీలేకుండా గడుపుతున్నారు. ప్ర‌జెంట్ ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. విద్యాసాగ‌ర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి ప్రధాన పాత్ర‌ల్లో నటించారు. కాగా ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్నారు.

జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువ జంటగా… శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న 14వ‌ చిత్రం ‘ఫాదర్-చిట్టి-ఉమ- కార్తీక్’. టైటిల్‌లోని మ‌రో ప్ర‌ధాన పాత్ర చిట్టిగా బేబి స‌హ‌శ్రిత న‌టిస్తోంది. ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షార్ట్‌క‌ట్‌లో ఈ సినిమా ‘ఎఫ్‌సీయూకే’గా పాపుల‌ర్ అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కూ నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ విల‌క్ష‌ణంగా ఉన్నాయంటూ అన్ని వ‌ర్గాల నుంచీ ప్ర‌శంస‌లు ల‌భించాయి. నూత‌న సంవ‌త్స‌రారంభం సంద‌ర్భంగా రాజమౌళి, దిల్ రాజు వంటి వారు ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్స్ ఎంత యూనిక్‌గా ఉన్నాయో, టీజ‌ర్ సైతం అంత యూనిక్‌గా ఉంద‌ని అంటున్నారు.

ఒక నిమిషం నిడివి క‌లిగిన ఈ ఉత్తేజ‌భ‌రిత‌మైన టీజ‌ర్‌లో నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌డం క‌నిపిస్తుంది. అయితే ఇక్క‌డ చెప్పుకోవాల్సింది జ‌గ‌ప‌తిబాబు (ఫాద‌ర్‌), బేబి స‌హ‌శ్రిత (చిట్టి) మ‌ధ్య అనుబంధం గురించి. ఒక ట్రెండ్‌సెట్టింగ్ యూత్‌ఫుల్‌ రొమ్‌కామ్‌గా ఈ సినిమా నిల‌వ‌నున్న‌ద‌నే న‌మ్మ‌కం టీజ‌ర్ క‌లిగిస్తోంది. నాలుగు పాత్ర‌లు.. ఫాద‌ర్‌, చిట్టి, ఉమా, కార్తీక్‌.. ఆ పాత్ర‌ల మ‌ధ్య వినోద‌భ‌రిత అనుబంధం ఉత్తేజాన్ని క‌లిగిస్తూ, సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమా ఇతివృత్తం ఏమిట‌నేది వెల్ల‌డించ‌కుండా ఉత్కంఠ‌త‌ను పెంచుతోంది చిత్ర బృందం. టీజ‌ర్ విడుద‌ల‌వ‌డం, దానిని ప్ర‌శంసిస్తూ టాలీవుడ్ సెల‌బ్రిటీలు కామెంట్లు చేయ‌డంతో ‘ఎఫ్‌సీయూకే’ గురించి మ‌రింత తెలుసుకోవాల‌నే కూతుహ‌లాన్ని నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు నిర్మాత కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్‌, డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు తెలిపారు. ‘ఎఫ్‌సీయూకే’ మూవీ గురించి యువ జంట రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి త‌మ‌ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసుకుంటున్న విష‌యాలు బ‌జ్‌ను రెట్టింపు చేస్తున్నాయి.