యంగ్ స్టార్ కార్తికేయ హీరోగా..లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా… కౌశిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా చావుకబురు చల్లగా. గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 9న జరగబోతోంది. ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు.
ఇక తాజాగా అనసూయ వేదాంతం చెపుతూ స్టెప్పులేసిన ఈ మూవీలోని పైన పటారం పాట యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది.

ఆ సంగతలా ఉంటే బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పుష్ప మూవీ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. ఆగస్టు 13వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి అప్ డేట్స్ కోసం ప్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే వచ్చేనెల బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులోని టెన్ కాశీలో పుష్ప షూటింగ జరుగుతోంది.