ఏప్రిల్ 14…సౌరమానం ప్రకారం ఉత్తరాది వారి ఉగాది వైశాఖి, తమిళుల పుత్తాండు, కేరళీయుల విషు పండుగల సందర్భంగా క్రేజీ న్యూస్ రిలీజ్ చేసారు. పవర్ఫుల్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కలయికలో సినిమా రాబోతుందని ప్రకటించారు మేకర్స్. గత కొన్ని రోజులుగా నడుస్తోన్న ఈ వార్త ఇప్పుడు అఫీషియల్ గా మారింది. శంకర్, విక్రమ్ కాంబో సూపర్ హిట్ మూవీ అపరిచితుడు రీమేక్…వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కనుంది. పెన్ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది. 2022 మధ్య నుంచి ఈ సినిమా సెట్స్ పైకెళ్లనుంది. అపరిచితుడు కథకే ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు మార్పులు చేసి రణ్ వీర్ సింగ్ ను సరికొత్తగా చూపిస్తారట డైరెక్టర్ శంకర్. హీరోయిన్ కియారా అద్వానీనా కాదా అన్నది తెలియాల్సిఉంది. 2022 మధ్యలో మొదలవుతుంది కాబట్టి ఈలోపు రామ్ చరణ్ సినిమాను పూర్తిచేస్తారు శంకర్.