మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. బాక్సర్ గా జూలై 30వ తేదీన బరిలోకి దిగనున్నారు. వరుణ్ తేజ్ నటిస్తున్న “గని” రిలీజ్ డేట్ కి సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. జనవరి 19న వరుణ్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ ప్లస్ టైటిల్ విడుదల చేసిన మూవీ యూనిట్… తాజాగా జూలై 30న గని ప్రేక్షకుల ముందుకు రానున్నాడని చెప్పేసింది.
ఇండియాలో బాక్సర్లు ఫేస్ చేస్తున్న సమస్యలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారట ఈ సినిమాతో. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక తండ్రిగా ఉపేంద్ర, కోచ్ గా సునీల్ శెట్టి, విలన్ గా జగపతి బాబు కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ మంజ్రేకర్ కుమార్తె సయూ మంజ్రేకర్ హీరోయిన్ గా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మరో కీలక పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నారు. సో..ఇన్ని ప్రత్యేకతలు ఉన్న గని జూలై 30న వచ్చి ఎంతలా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తాడో చూడాలి.