లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది ట్రిపుల్ ఆర్ . యాక్షన్ షూట్ తోపాటు ప్యాచప్స్ కంప్లీట్ చేస్తున్న RRR సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో కంటిన్యూ అవుతోంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ,బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబయ్ సెట్స్ లో జరుగుతోంది. విజయ దేవరకొండ సైతం ఇప్పట్లో ముంబై వదిలి వచ్చేలా లేడు. లైగర్ షూటింగ్ ఇంకా ముంబైలోనే చేస్తున్నారు పూరీ జగన్నాథ్.

చెర్రీ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ట్రీట్ ఇచ్చిన చిరంజీవి ఆచార్య టీమ్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉంది. ఏప్రిల్ 2 నుంచి ఆచార్య సినిమా కోకాపెట్ లో మళ్లీ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ బెల్గాం ఆశ్రమంలో జరుగుతుంటే, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున నటిస్తోన్న సినిమా గోవాలో జరుగుతుంది. ఇక రామానాయుడు స్టూడియోలో శరవేగంగా దృశ్యం -2 షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు వెంకటేశ్.

మహేశ్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ గోవాలో జరుగుతుండగా… ఇటలీలో ఖిలాడీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు రవితేజ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో పుష్ప సీన్స్ ను టోలీచౌకిలో చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ గని సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో కొనసాగుతుంది. సాయిధరమ్ తేజ్, దేవా కట్టా సినిమా రిపబ్లిక్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోకల్ లొకేషన్స్ లోనే జరుగుతుంది.

గని…బాక్సింగ్ డ్రామా నేపథ్యంలో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ నటిస్తోన్న 10వ సినిమా. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీ జూలై 30 అని ప్రకటించారు. ప్రభాస్ రాధేశ్యామ్ కూడా అదే రిలీజ్ డేట్ ను బుక్ చేసుకోవడంతో గని వెనక్కితగ్గుతాడామే చూడాలి. సరే ఏదేమైనా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది గని చిత్రం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండగా…క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర గని టీంతో చేతులు కలిపారు. ఆయ‌నకు మూవీ యూనిట్ పుష్ప‌గుచ్ఛంతో స్వాగ‌తం ప‌లికింది. ఉపేంద్ర ప‌వర్‌ఫుల్ పాత్ర‌లో వరుణ్ తేజ్ తండ్రిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ బ్యానర్లపై అల్లు బాబీ, సిద్ధు ముద్దా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలీవుడ్ గర్ల్ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి బాక్సింగ్ కోచ్ గా నటిస్తుండగా…వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా… మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. బాక్సర్ గా జూలై 30వ తేదీన బరిలోకి దిగనున్నారు. వరుణ్ తేజ్ నటిస్తున్న “గని” రిలీజ్ డేట్ కి సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. జనవరి 19న వరుణ్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ ప్లస్ టైటిల్ విడుదల చేసిన మూవీ యూనిట్… తాజాగా జూలై 30న గని ప్రేక్షకుల ముందుకు రానున్నాడని చెప్పేసింది.
ఇండియాలో బాక్సర్లు ఫేస్ చేస్తున్న సమస్యలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారట ఈ సినిమాతో. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక తండ్రిగా ఉపేంద్ర, కోచ్ గా సునీల్ శెట్టి, విలన్ గా జగపతి బాబు కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ మంజ్రేకర్ కుమార్తె సయూ మంజ్రేకర్ హీరోయిన్ గా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మరో కీలక పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నారు. సో..ఇన్ని ప్రత్యేకతలు ఉన్న గని జూలై 30న వచ్చి ఎంతలా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తాడో చూడాలి.

వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా…ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ‘గని’ అన్న టైటిల్ ను ఖరారు చేస్తూ వరుణ్ ఇస్తున్న పంచ్ హైలైట్ గా మారింది. లైగర్ లో బాక్సర్ గా విజయ్ దేవరకొండ నటిస్తుంటే బాక్సర్ గనిగా వరుణ్ తేజ్ కనిపించబోతున్నారు. ఈ మూవీలో హీరో పాత్ర పేరు గని కాబట్టే..టైటిల్ కి కూడా ఆ పేరే కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది.
ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తండ్రిగా స్టార్ యాక్టర్ ‘ఉపేంద్ర’ నటిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ కోచ్ గా బాలీవుడ్ నటుడు ‘సునీల్ శెట్టి’, విలన్ గా ‘జగపతిబాబు’ కనిపించబోతున్నారు. ‘నవీన్ చంద్ర’ కూడా కీ రోల్ పోషిస్తున్న గనికి ‘తమన్’ సంగీతం అందిస్తున్నారు.

Source: Geetha Arts