మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఓ విషయంలో పోటీపడుతున్నారట. ఇద్దరికీ ఒకే హీరోయిన్ కావాలంటూ సందడి చేస్తున్నారట. ఇదంతా సరదాగా తీసుకున్నా నిజానికి మాత్రం బాలీవుడ్ దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ ఇద్దరు సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ రజినీకాంత్ వంటి సీనియర్ హీరోతో లింగా సినిమా చేసిన సోనాక్షి అయితేనే వీళ్లకి కూడా బాగుంటుందని అనుకుంటున్నట్టు టాక్.

చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా హీరోయిన్ గా కనిపించనుందట. ఇటు మలినేని గోపిచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న సినిమాలోనూ సోనాక్షినే హీరోయిన్ అన్న ప్రచారం జరుగుతుంది. అయితే రెండు చిత్రాల మేకర్స్ ఇప్పటికే సోనాక్షిని కలిసారని…ఆమె కూడా పాజిటివ్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఈ విషయాలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నందమూరి అభిమానులకు పండగే పండుగ. ఉప్పెన ప్రమోషన్స్ లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ తమ తదుపరి సినిమాల గురించి అధికారిక ప్రకటన చేసాయి. అయితే అవి నందమూరి అందగాళ్ల సినిమాలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాలయ్య బాబుతో ఒక సినిమా, ఎన్టీఆర్ తో మరొక సినిమాను తెరకెక్కించబోతున్నట్టు స్పష్టం చేసారు నిర్మాతలు.

మాస్‌ఫ్యాన్స్ ను ఖుషీ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు నందమూరి బాలకృష్ణ. మరోవైపు రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘క్రాక్‌’తో మాస్ ప్రేక్షకులను ఆకర్షించారు గోపీచంద్‌మలినేని. క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య సినిమా ఉంటుందనే వార్తలు బాగా చక్కర్లు కొట్టాయి. కాగా ఈ న్యూస్ నిజమేనని ప్రకటించారు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్… రవిశంకర్‌, నవీన్. వీళ్లిద్దరి కాంబో మూవీని తమ బ్యానర్‌పై నిర్మిస్తున్న సంగతి నిజమేనని స్పష్టం చేసారు. ప్రజెంట్ గోపీచంద్‌ స్ర్కిప్ట్‌ వర్క్ లో ఉన్నారని.. బాలయ్య-బోయపాటి మూవీ అయిన వెంటనే తమ ప్రాజెక్ట్‌ ప్రారంభమవుతుందని తెలియజేసారు.

ప్రశాంత్ నీల్… ‘కేజీఎఫ్‌’ చాప్టర్స్ తో ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించిన దర్శకుడు. తారక్‌తో ఆయన ఓ సినిమా చేయనున్నారంటూ చాలారోజుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. అయితే, ‘సలార్‌’ తర్వాత ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలిపారు ప్రొడ్యూసర్ నవీన్. ఇదిలావుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్‌. ఇప్పుడిలా తమ అభిమాన హీరోకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ రావడంతో ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్.

2020 కరోనా కాలం తర్వాత 2021 సంక్రాంతికి బోణీకొట్టిన క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని. క్రాక్ స‌క్సెస్‌తో ఫుల్ హుషారుమీదున్న ఈ డైరెక్టర్ రీసెంట్ గా నంద‌మూరి బాల‌కృష్ణ‌ను కలిసి ఓ మాస్ ఎంట‌ర్ టైన్మెంట్ స్టోరీ వినిపించారట…సింగిల్ సిట్టింగ్ లో బాలయ్య ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మ్యాటర్ కి సంబంధించి…తాజాగా ఓ అప్‌డేట్ వ‌చ్చింది.
వరుస సినిమాలతో బిజీగా మారిన ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుందట. అంతేకాదు బోయపాటి సినిమా పూర్తవగానే బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో కలిసి వర్కౌట్ చేస్తారట. ఇక ఈ సంవత్సరం మే నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుందట. మైత్రీ మూవీ మేక‌ర్స్ సైతం త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.
క్రాక్ మూవీ బాక్సాపీస్ హిట్ కావడంతో కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ నుంచి సైతం గోపీచంద్ మలినేని చెంతకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. అయితే ఈ డైరెక్టర్ మాత్రం బాలయ్యబాబుతో మూవీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరిచూద్దాం బాలకృష్ణతో మరో క్రాకింగ్ హిట్ కొడతారేమో గోపీచంద్ మలినేని.