వయసు ముదురుతున్నా ఫిజిక్ మెయిన్టైన్ చేస్తూ… డ్యాన్స్ మూవ్ మెంట్లలో ఎప్పటికప్పుడు ట్రెండ్ సృష్టిస్తోన్న హీరోయిన్ తమన్నా. ధర్టీ ప్లస్ భామ అయినా ఆ థాట్ రాకుండా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తాజాగా సంపత్ నంది డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా నటిస్తోన్న సీటీమార్ మూవీలో తమ్మూ చేసిన మాస్ సాంగ్ యూట్యూబ్ ని హీటెక్కిస్తుంది.
ఈ వీడియో సాంగ్ కు మూవీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తెలంగాణ పిల్ల, ఆంధ్రా పిల్లడా అంటూ సాగుతున్న ఈ పాటలో గోపీచంద్, తమన్నా మాస్ స్టెప్పులు ఎట్రాక్ట్ చేస్తున్నాయి. తెలంగాణ జానపద గీతం ”గొల్లా మల్లమ్మ కోడలా..’ తో పాటూ’నడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా’ అనే పాటలు అందరికీ తెలిసే ఉంటాయి. ఈ జ్వాలా రెడ్డి సాంగ్ వింటుంటే అవే పాటలు గుర్తొస్తుంటాయి. ఆ పాటల ట్యూన్ ను వాడేసుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. మరి క్రెడిట్స్ ఇస్తున్నారా లేదంటే లవ్ స్టోరి సారంగదరియాకు ఎదురైన అనుభవం..ఈ పాటకూ తప్పదా చూడాలి. కాగా సీటీమార్ ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమైంది.

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి పేరుతెచ్చుకున్న అఖిల్ సార్ధక్ వరుస టాలీవుడ్ ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈమధ్యే మోనాల్ గజ్జర్ తో లీడ్ రోల్ చేస్తూ తెలుగు అబ్బాయి – గుజరాతీ అమ్మాయి అన్న సినిమాను పట్టాలెక్కించాడు. కాగా ఇప్పుడు గోపీచంద్ సీటీమార్ లో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. బిగ్ బాస్ షోతో తన ప్రత్యేకతను చాటుకొని…ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకున్న అఖిల్…ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి నటిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తోన్న సీటీమార్ ను తెరకెక్కిస్తున్నారు మాస్ డైరెక్టర్ సంపత్ నంది. భూమిక ఇందులో కీ రోల్ చేస్తున్నారు. ఈమధ్యే రిలీజైన సీటీమార్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ దక్కింది. అయితే బిగ్ బాస్ ఫేం అఖిల్ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడన్న విషయాన్ని ఇన్నిరోజులు గోప్యంగా ఉంచింది సీటీమార్ టీమ్. ఏప్రిల్ 2న సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

కబడ్డీ కోచ్ లుగా గోపీచంద్, తమన్నా నటిస్తోన్న సీటీమార్ టీజర్ తాజాగా రిలీజైంది. స్పోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అంతకుమించి అన్నట్టగా ఉండబోతుందనేది స్పష్టమైంది. సరికొత్త కథాంశంతో మాస్ డైలాగులతో బూస్టప్ ఇచ్చి సినిమాను రెడీ చేసారు డైరెక్టర్ సంపత్ నంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం సీటీమార్ టీజ‌ర్‌లోని సీన్స్ ప్రేక్ష‌కుల‌ని బాగానే ఆక‌ట్టుకుంటున్నాయి. గోపీచంద్ మొదటిసారి నటిస్తోన్న భారీ బడ్జెట్..హై క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం ఇది. సూపర్ టెక్నిక‌ల్ వ్యాల్యూస్ తో చాలా ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని మలుస్తున్నారు సంపత్ నంది. స్వరబ్రహ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేశారు. భూమిక ప్రధానపాతర పోషిస్తుండగా…పోసాని కృష్ణముర‌ళి, దిగంగన, రావు ర‌మేష్‌, రెహ‌మాన్, బాలీవుడ్ నటుడు త‌రుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం సీటీమార్ టీజ‌ర్‌లోని సీన్స్ ప్రేక్ష‌కుల‌ని బాగానే ఆక‌ట్టుకుంటున్నాయి. గోపీచంద్ మొదటిసారి నటిస్తోన్న భారీ బడ్జెట్..హై క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం ఇది. సూపర్ టెక్నిక‌ల్ వ్యాల్యూస్ తో చాలా ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని మలుస్తున్నారు సంపత్ నంది. స్వరబ్రహ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేశారు. భూమిక ప్రధానపాతర పోషిస్తుండగా…పోసాని కృష్ణముర‌ళి, దిగంగన, రావు ర‌మేష్‌, రెహ‌మాన్, బాలీవుడ్ నటుడు త‌రుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Source: Aditya Music

శివరాత్రికి ముహూర్తం
మాస్ రాజా రవితేజ నటిస్తోన్న ఖిలాడి టీజర్ ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజ్ చేస్తున్నారు. అర్జున్, అనసూయ కీరోల్స్ ప్లే చేస్తోన్న ఖిలాడి మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హీరోయిన్ పక్కా..?
గోపీచంద్ – మారుతి పక్కా కమర్షియల్ మూవీలో హీరోయిన్ గా రాశిఖన్నా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఇందులో మరో హీరోయిన్ గా తెలుగమ్మాయి ఈశారెబ్బా కనిపించనుందట.

రామ్..ఊర మాస్
పందెంకోడి, ఆవారా సినిమాల డైరెక్టర్ లింగుస్వామితో…హీరో రామ్ తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. లింగు స్వామి చెప్పిన ఊర మాస్ స్టోరి రామ్ కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని టాక్.

పవర్ ప్లే…కమింగ్
కొండా విజయ్ కుమార్, రాజ్ తరుణ్ కాంబినేషన్లో తెరకెక్కిన పవర్ ప్లే మూవీ మార్చి 5న రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈ మూవీ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

సైజ్ జీరో అనుష్కలా…
అజయ్ దేవగణ్ సరసన ప్రణీత నటిస్తోన్న కొత్త సినిమాలో ఆమె రెండు పాత్రలు చేస్తున్నారట. ఒకటి నాజుకుగా కనబడే రోల్ కాగా మరొకటి సైజ్ జీరో అనుష్కలా భారీకాయంతో కనిపించే పాత్ర కావడం విశేషం.

రాధేశ్యామ్ రిలీజ్ డేట్ జూలై 30 అని ప్రకటించడంతో ఆలోచనలో పడ్డారు వరుణ్ తేజ్ గని మేకర్స్. మరి జూలై 30నే వరుణ్ తేజ్, ప్రభాస్ పోటీపడుతారా..లేదంటే వరుణ్ వెనక్కి తగ్గుతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏప్రిల్ 9న రిలీజ్ డేట్ ప్రకటించిన వకీల్ సాబ్ తో పోటీపడేందుకు సిద్ధమయ్యారు తమిళ్ స్టార్ ధనుష్. ఈ హీరో నటించిన కర్ణన్ మూవీని సైతం మల్టీ లాంగ్వేజేస్ లో ఏప్రిల్ 9వ తేదీనే విడుదల చేస్తున్నారు మేకర్స్. అలాగే గోపీచంద్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సిటీమార్ రిలీజ్ డేట్… ఏప్రిల్ 2పైనే కన్నేసారట నాగార్జున. అదేరోజున నాగ్ నటించిన వైల్డ్ డాగ్ సైతం విడుదలకు రెడీఅయినట్టు టాక్ వినిపిస్తోంది.

నిజానికి పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, గోపీచంద్ సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడో ప్రకటించారు దర్శకనిర్మాతలు. కొత్తగా ఇవే డేట్స్ పై కర్చీఫ్ వేసారు ధనుశ్, ప్రభాస్, నాగార్జున సినిమాల దర్శకనిర్మాతలు. ఈ పోటీని చూస్తుంటే ప్రభాస్ రాధేశ్యామ్ ని తలపడకుండా వరుణ్ తేజ్ గని వెనక్కి తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ వకీల్ సాబ్, కర్ణన్ సినిమాలూ…సీటీమార్, వైల్డ్ డాగ్ సినిమాలకి మాత్రం పోటీ తప్పేలా కనిపించడం లేదు. చూద్దాం…ముందు ముందు ఏం జరుగబోతుందో….

ప్రారంభం కూడా అవకముందే రిలీజ్ డేట్ ప్రకటించి వహ్వా అనిపించిన కాంబో గోపీచంద్ – మారుతి. అక్టోబరు 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ ఎంత డిఫరెంట్ గా ప్లాన్ చేసాడో…డైరెక్టర్ మారుతి టైటిల్ ని సైతం అంతే విభిన్నంగా ఫిక్స్ చేశాడు. అవును ఈ చిత్రానికి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టేనని టాక్.

కోర్ట్ బ్యాక్ డ్రాప్ లో గోపీంచంద్ నటించబోయే ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా బ్యూటీ గర్ల్ రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నాడు మారుతి. వీరి కాంబినేషన్లో హిట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’ చ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే జిల్, ఆక్సిజన్ తర్వాత ముచ్చటగా మూడోసారి గోపీచంద్ సరసన నటించబోతుంది రాశీ ఖన్నా.

నిజానికి ఈ స్టోరీని మొదట రవితేజతో తీయాలని మారుతి అనుకున్నప్పటికీ.. ఆఖరికి గోపిచంద్ ను ఫిక్స్ చేసారట మేకర్స్! ఇంక చాలా రోజుల నుంతి తర్జనభర్జన పడుతున్న మూవీ యూనిట్ కి హీరోయిన్ కూడా సెట్ కావడంతో ‘పక్కా కమర్షియల్’ అవాంతరాలన్నీ తొలిగినట్టే. అతిత్వరలో సెట్స్ పైకెళ్లనున్న ఈ మూవీని చాలా వైవిధ్యంగా జనాల్లోకి తీసుకొస్తుంది మారుతి టీమ్. బన్నీ వాసుతో పాటూ యువి క్రియేషన్స్ వంశీ ప్రమోద్, విక్రమ్ కలిసి ఈ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్… గీతా ఆర్ట్స్ పతాకంపై సమర్పిస్తున్నారు.

కోర్ట్ బ్యాక్ డ్రాప్ లో గోపీంచంద్ నటించబోయే ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా బ్యూటీ గర్ల్ రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నాడు మారుతి. వీరి కాంబినేషన్లో హిట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’ చ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే జిల్, ఆక్సిజన్ తర్వాత ముచ్చటగా మూడోసారి గోపీచంద్ సరసన నటించబోతుంది రాశీ ఖన్నా.

నిజానికి ఈ స్టోరీని మొదట రవితేజతో తీయాలని మారుతి అనుకున్నప్పటికీ.. ఆఖరికి గోపిచంద్ ను ఫిక్స్ చేసారట మేకర్స్! ఇంక చాలా రోజుల నుంతి తర్జనభర్జన పడుతున్న మూవీ యూనిట్ కి హీరోయిన్ కూడా సెట్ కావడంతో ‘పక్కా కమర్షియల్’ అవాంతరాలన్నీ తొలిగినట్టే. అతిత్వరలో సెట్స్ పైకెళ్లనున్న ఈ మూవీని చాలా వైవిధ్యంగా జనాల్లోకి తీసుకొస్తుంది మారుతి టీమ్. బన్నీ వాసుతో పాటూ యువి క్రియేషన్స్ వంశీ ప్రమోద్, విక్రమ్ కలిసి ఈ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్… గీతా ఆర్ట్స్ పతాకంపై సమర్పిస్తున్నారు.

ఒకే రోజు వరుసబెట్టి రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఆగస్టు 2న సిటీమార్ కొడతానంటున్నారు గోపీచంద్. కబడ్డీ కోచ్ పాత్రల్లో గోపీచంద్, తమన్నా నటించారు ఈ సినిమాలో. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న మూవీ యూనిట్ సిటీమార్ ను ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

మొత్తానికి 2020 విషాదాన్ని మర్చిపోయి 2021లో ఫుల్ జోష్ నింపేలా తలపిస్తుంది వాతావరణం. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న అని జక్కన్న ప్రకటించారో లేదో…లవ్ స్టోరి ఏప్రిల్ 16న వస్తుందని చెప్పేసారు శేఖర్ కమ్ముల. ఇదే రోజున నాని టక్ జగదీష్ కూడా విడుదలకానుంది. ఇక బాక్సర్ గా వరుణ్ తేజ్ జూలై 30న వస్తుంటే…పుష్పగా బన్నీ ఆగస్టు 13న రానున్నారు. సో ఇలా ఈ సంవత్సరమంతా పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడనున్నాయి.

అవును…డైరెక్టర్ మారుతి 10వ సినిమా, హీరో గోపీచంద్ 29వ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ ప్రాజెక్ట్ యూనిట్ వెల్లడించింది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో… జీఏ 2 బ్యానర్ పై బన్నీ వాసు, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
నిజానికి దర్శకుడు మారుతి రవితేజ లేదంటే కళ్యాణ్ రామ్ హీరోగా సినిమాను ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అలాగే గోపీచంద్, తేజ కాంబినేషన్ లో అలివేలు మంగ – వేంకట రమణ వస్తుందనుకున్న…అదీ జరగలేదు.
కారణాలేవైనా….రవితేజ, కళ్యాణ్ రామ్ లతో మారుతి జోడీ కుదరలేదు. ఇటు తేజ, గోపీచంద్ కాంబినేషన్ కి బ్రేక్ పడింది. దీంతో అనూహ్యంగా గోపీచంద్, మారుతి ఒక్కటయ్యారు. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం రిలీజ్ చేసి….సెట్స్ పైకి వెళ్తారట.

అలివేలుమంగ – వేంకటరమణ…గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న పేరిది. గోపీచంద్, కాజల్ జంటగా తేజ డైరెక్ట్ చేయబోతున్నారనే ప్రచారం బాగా జరిగింది. ఈ విషయాన్ని ఎవరూ ఖండించలేదు కూడా. అయితే అనూహ్యంగా తెరపైకి తాప్సీ పేరొచ్చింది. దర్శకుడు తేజ… కాజల్ ని తప్పించి తాప్సీని హీరోయిన్ గా కూర్చోబెట్టారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
తాప్సీ పేరు పైకి రాగనే ఈ ప్రాజెక్ట్ నుంచి గోపీచంద్ తప్పుకున్నారనే మరో వార్త హల్చల్ చేస్తోంది. అయితే గతంలో మొగుడు సినిమాలో నటించిన వీరిద్దరి జంట ఫ్లాప్ ని చవిచూసింది. దీంతో గోపీచంద్ కి, తనకి సెట్ కాదని..తాప్సీనే తేజకి సలహా ఇచ్చిందనే గుసగుసలు మొదలయ్యాయి. గోపీచంద్ వేంకటరమణగా కనిపించకుండా వెళ్లిపోడానికి కారణం తాప్సీనే అని కొంతమంది పబ్లిసిటీ ఇస్తున్నారు.
వర్షన్ 2 మరోలా ఉంది. అలివేలుమంగ – వేంకటరమణ…చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట తేజ. అందుకే కాజల్ ని కాదని బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న తాప్సీ పన్నును పట్టుకొచ్చారని టాక్. ఇదే కారణంతో గోపీచంద్ కు కూడా బైబై చెప్పేసి…సౌత్ లోనూ పేరున్న ఓ బాలీవుడ్ హీరో కోసం మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఏదేమైనా అతిత్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారు తేజ. అంతవరకు ఏది నిజమో తేజకే తెలియాలి.

గోపీచంద్, డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో ప్రస్తుతం బిజీ షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం సీటీమార్. మాస్ గేమ్ క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఇది. ఆంధ్ర ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా ఇందులో న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే  ఈ సినిమా నుంచి విడుద‌ల‌చేసిన ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, జ్వాలా రెడ్డిగా త‌మ‌న్నాలుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా న్యూ ఇయ‌ర్ విషెస్‌తో తాజాగా  గోపీచంద్ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది చిత్ర యూనిట్‌. ప్ర‌స్తుతం చేవెళ్ల‌లో వేసిన భారీ సెట్లో ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ సార‌థ్యంలో డైరెక్టర్ సంప‌త్ నంది భారీ ఎత్తున యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సెట్లోనే కేక్ క‌ట్ చేసి న్యూ ఇయ‌ర్ ని సెల‌బ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్‌. ఈ నెల 30 వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్‌తో ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది.

మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప‌ల్లెటూరి అమ్మాయి గా ఒక ప్రత్యేక పాత్రలో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.