యంగ్‌ టైగర్‌, మాటల మాంత్రికుడి సినిమాకు ముహూర్తం కుదిరింది. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ 13న ఉగాదికి అధికారికంగా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రిస్టీజియస్‌ పాన్‌ ఇండియా సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే.. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కలిసి చేయబోతున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా ఏప్రిల్‌ లో వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్న అనంతరం మళ్లీ మే, జూన్‌ నెలల్లో ఈ ప్రాజెక్ట్ కోసం పూర్తిగా డేట్స్‌ కేటాయిస్తారట తారక్. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై ఎస్‌.రాధాకృష్ణ, కళ్యాణ్‌రామ్‌ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.