వకీల్ సాబ్ షూటింగ్ పూర్తైన తర్వాత రానాతో కలిసి అటు అయ్యప్పనుమ్..కోషియుమ్ రీమేక్…ఇటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు పవన్ కల్యాణ్. అయితే బందిపోటు, వీరమల్లు, విరూపాక్ష వంటి టైటిల్స్ క్రిష్ కాంబో మూవీ కోసం సెట్ చేసారనే ప్రచారం జరిగింది. అయితే చివరికి ‘హరహర మహాదేవ్’ అన్న పేరును ఫిక్స్ చేసారట. దీనికోసం ఇప్పటికే ఫిల్మ్ నగర్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించినట్టు వార్తలొస్తున్నాయి.

పవర్ స్టార్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్ గా ఎంపికవగా…మరో హీరోయిన్ గా బాలీవుడ్ సోయగం జాక్వలిన్ ఫెర్నాడెజ్ ను కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. అయితే మరో స్పెషల్ సాంగ్ కోసం హాట్ యాంకర్ అనసూయను కూడా సంప్రదించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయ్యప్పనుమ్..కోషియుమ్ రీమేక్ కోసం కేవలం నెలన్నర డేట్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్…క్రిష్ కోసం మార్చి లేదా ఏప్రిల్ నుంచి నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటారట. ఏకబికిన షూటింగ్ పూర్తి చేసి ఏడాది చివరికల్లా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేస్తారట క్రిష్. అంతా అనుకన్నట్టు జరిగితే 2022 సంక్రాంతి బరిలో ఈ మూవీ కూడా దిగుతుందని అంటున్నారు.