ఓ వైపు రాజకీయల్లో చురుగ్గా ఉంటూనే మరోవైపు వరుస సినిమా షూటింగ్స్ తో తీరిక లేకుండా గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం హరిహర వీరమల్లు కోసం బాగా కష్టపడుతున్నారు. ఈ సెట్స్ నుంచి తాజాగా రిలీజైన ఫోటోలు పవన్ డెడికేషన్ ఎలాంటిదో చూపిస్తున్నాయి. వీరమల్లులోని యాక్షన్ సీన్స్ కోసం ఉదయం 7గంటల నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు పవన్ కల్యాణ్.
యాక్షన్ డైరెక్టర్ శామ్ కౌశల్ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ యాక్షన్ సన్నివేశాలకు కష్టపడుతున్నారు. ఈ సినిమాలో అత్యంత స్పెషల్ యాక్షన్ సీన్స్ కోసం కత్తి చేతపట్టి పవన్ చేస్తున్న స్టంట్స్ …ఆయన అంకిత భావానికి నిదర్శనమని నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలియజేసింది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లులో పవన్ వజ్రాల దొంగగా కనిపిస్తారని టాక్. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా…జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఔరంగ జేబు కుమార్తెగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా రానున్నాడు హరిహర వీరమల్లు.