అగ్రకథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో తో ఇబ్బంది పడుతున్నా ఆయన, మన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. రజనీకి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని బీపీ అదుపు లోకి రాగానే డిశ్చార్జ్ చేస్తామని ప్రెస్ నోట్ విడుదల చేసింది. రజినీకాంత్ గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అన్నాత్తై షూటింగ్ కోసం ఆయన నగరానికి వచ్చారు. ఐతే కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్ క్వారంటైన్‌‌‌కు వెళ్లారు. కాగా హైదరాబాద్లో షూటింగ్లో లో ఇద్దరికీ పాజిటివ్వచ్చింది . ఈనెల 22న రజినీకి టెస్ట్ చేశారు నెగిటివ్ వచ్చింది.