‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిన ప్రభాస్ వరుసపెట్టి సినిమాలను అంగీకరించారు. అన్నీ బడా సినిమాలే. రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా…సలార్, ఆదిపురుష్ షూటింగ్ కూడా చేసుకుంటున్నాయి. నాగ్ అశ్విన్ కాంబినేషన్ మూవీ ఇంకా ప్రారంభంకావాల్సిఉంది. అయితే ఈ సినిమాల గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. తాజాగా ఆదిపురుష్ అమ్మ కనిపించేందు ప్రముఖ బాలీవుడ్ నటి ఓకే చెప్పారన్నవార్త ట్రెండింగ్ గా మారింది.
ఓం రౌత్ డైరెక్షన్లో రామునిగా ప్రభాస్ కనిపించనుండగా…ఆయనకు తల్లిగా కౌసల్య పాత్రలో హేమామాలిని నటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ ను చిత్రయూనిట్ సంప్రదించగా…ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. రామాయణ నేపథ్యంగా భారీ బడ్జెట్ ప్లస్ ప్యాన్ ఇండియన్ మూవీ కావడంతో హేమామాలిని వెంటనే ఓకే చెప్పారని అంటున్నారు. ఇదివరకు తెలుగు హీరో బాలకృష్ణకు తల్లిగా గౌతమీపుత్ర శాతకర్ణీలో నటించారామె. ఇప్పుడిలా ప్రభాస్ మాతృమూర్తిగా కనిపించబోతున్నారు. రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తుండగా…సీతగా కృతీసనన్ పేరు వినిపిస్తోంది, అఫీషియల్ మాత్రం కాదు. ఏదేమైనా ఆదిపురుష్ ను మాత్రం 2022 ఆగస్ట్‌ 11న సినిమా హాళ్లకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.