తన సొంతగూటికి చేరుకున్నారు ఇళయరాజా. ఇన్నాళ్లు చెన్నై పట్టణం సాలిగ్రమంలోని ప్రసాద్ స్టూడియోస్ లో తన సంగీతానికి సంబంధించిన పనులు చేసుకున్న మాస్ట్రో…ఇప్పుడిక సొంత స్టూడియోలో రికార్డింగ్ మొదలుపెట్టారు. ప్రసాద్ స్టూడియోస్ నుంచి రాజాను ఖాళీ చేయమన్న విషయంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. కేసులు, కోర్టులు అంటూ పట్టుబట్టిన ఇళయరాజా…చివరికి తానే వెనక్కుతగ్గి తనకు సంబంధించిన వస్తువులను తీసుకొని అక్కడి నుంచి ఖాళీచేసారు.

అదే చెన్నైలోని టీ నగర్ సమీపంలో ఎంఎం థియేటర్ ను కొనుగోలు చేసి దానినే తన రికార్డింగ్ థియేటర్ గా మార్చుకున్నారు. దీనికి ఇళయరాజా స్టూడియో అని పేరుపెట్టారు. ఈ రీకార్డింగ్ థియేటర్లోనే తన సంగీత కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ స్టూడియోలో తొలిసారిగా తమిళ్ కమెడియన్ సూరీ హీరోగా డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న చిత్రంలోని పాటలను రికార్డింగ్ చేస్తున్నారు.