గ‌తేడాది వి అనే చిత్రంతో ఆడియెన్స్ ను పూర్తిగా అల‌రించలేకపోయిన నాని ఈ ఏడాది ఉగాది తర్వాత తన కొత్త సినిమాకు ముహూర్తం పెట్టుకున్నారు. ఏప్రిల్ 16న అనుకున్నప్పటికీ..ఏప్రిల్ 23న టక్ జగదీష్ గా నాని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నాని 26వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని… షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ప్రొడ్యూస్ చేస్తున్నారు. త‌మ‌న్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
‘నిన్నుకోరి` వంటి ఎమోషనల్ మూవీ త‌ర్వాత నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో టక్ జగదీష్ రాబోతుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేసారు. అందులో భాగంగానే ఫిల్మ్ నుంచి “ఇంకోసారి ఇంకోసారి” అనే సాంగ్ లిరిక‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. నాని, రీతు వ‌ర్మ జంట‌ డైలాగ్స్ తో కూడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తుంది.

Source: Aditya music