వాళ్లు, వీళ్లు కాదు…ఏకంగా మహేశ్ బాబుతోనే జాన్వీకపూర్ ఎంట్రీ ఉండబోతుందనే ప్రచారం జోరందుకుంది. నిజానికి మహేశ్ ఫాదర్ సూపర్‌ స్టార్‌ కృష్ణ, గ్లామర్ క్వీన్ గా సినీరంగాన్ని ఏలిన శ్రీదేవి కాంబోలో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి మనకి తెలిసిందే. అప్పట్లో వీరి జంటకి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఎన్టీఆర్ సినిమా అనీ, రామ్ చరణ్ సినిమా అనీ అనుకుంటే కృష్ణ వారబ్బాయి సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తొలిసారి టాలీవుడ్ సినిమా కోసం వర్క్ చేయబోతుందని టాక్. ఈ సినిమాకు కరణ్‌ జోహార్‌ ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. అంతేకాదు ఓ న్యూ టాలెంట్ ని ఈ ప్రాజెక్ట్ తో డైరెక్టర్ గా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట. చిత్రీకరణను కూడా ఎక్కువగా సాగదీయకుండా రెండు నెలల్లోనే పూర్తి చేస్తారని చెప్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే!

ప్రస్తుతం ‘గీతా గోవిందం’ ఫేం పరశురామ్‌ డైరెక్షన్లో మహేశ్ చేస్తున్న ‘సర్కారు వారి పాట‘ పూర్తవగానే మహేశ్‌ జాన్వీతో సినిమా పట్టాలెక్కింటనున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాతే దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.