కేట్ విన్‌స్లెట్‌…ఈ పేరు తెలియని వారు అత్యంత అరుదు. ‘టైటానిక్‌’ మూవీతో 90స్ యువత హృదయాల్ని కొల్లగొట్టిన ఈ భామ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. అయితే టైటానిక్ ప్రపంచవ్యాప్త గుర్తింపును దక్కించుకుంది. ఆస్కార్ కి పోటీపడింది. కానీ ఆ సినిమాను మళ్లీ చూడాలంటే ఆసహ్యం అన్న కామెంట్స్ తాజాగా చేసింది కేట్. గ్రామీ అవార్డ్స్ వాయిదా కారణంగా ఇచ్చిన ఇంటర్వ్యులో ఇలా మాట్లాడింది. టైటానిక్ మూవీని ఇప్పుడు చూడాలంటే సిగ్గేస్తుందని వాఖ్యానించింది.
1997లో రిలీజైన టైటానిక్ తర్వాత ఆ మూవీ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో మళ్లీ ‘అవతార్‌’ సీక్వెల్‌లో నటిస్తుంది కేట్. అయితే మరి ఎందుకు టైటానిక్ చూస్తే సిగ్గేస్తుందోనని ప్రేక్షకులకి అర్ధం కావట్లేదు. ఆ చిత్రంలో చేసిన న్యూడ్ అండ్ అడల్ట్ సీన్స్ చూసా అంటే…అంతకుమించి తర్వాతి సినిమాల్లో రెచ్చిపోయింది. వాటికి రాని సిగ్గు… డెకాప్రియోతో చేసిన రొమాన్స్ చూస్తే ఎందుకొస్తుంది అంటున్నారు నెటిజన్స్. మరెందుకు ఈ సిగ్గుపడే కామెంట్స్ చేసిందో కేట్ కే తెలియాలి.