ఇండియన్ స్పీడ్‌ స్ట‌ర్ జ‌స్‌ ప్రీత్ బుమ్రా నాలుగో టెస్ట్‌, కొన్ని వ‌న్డేలతో పాటూ టీ 20 ఆట నుంచి వ్య‌క్తిగ‌త కార‌ణాలతో వైదొలిగాడు. అయితే వివాహం కోస‌మే బుమ్రా క్రికెట్ మ్యాచ్‌ల‌కు దూరమయ్యాడని ప్ర‌చారం న‌డుస్తోంది. బీసీసీఐ టీమ్స్ కూడా బుమ్రా మ్యారేజ్ చేసుకుంటున్నాడని ఏఎన్‌ఐ న్యూస్‌ ఏజెన్సీకి తెలిపాయని టాక్. అయితే బుమ్రా వివాహమడేది ఓ టాలీవుడ్ హీరోయిన్ అయిన కేరళకుట్టిననే టాక్ ఊపందుకుంది.
అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో… బుమ్రా పెళ్లి జ‌ర‌గబోతుందంటూ జనాలు జోరుగా ప్ర‌చారం సాగిస్తున్నారు. గత కొన్నాళ్ళ నుంచి వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌నీ అంతేకాదు బుమ్రా త‌న ఇన్‌స్టా అకౌంట్ లో ఫాలో అయ్యే ఒకే ఒక్క ముద్దుగుమ్మ అనుప‌మ‌నే అవ‌డంతో ఈ ఇద్ద‌రికి ఏదో బంధం ఉంద‌ని అంటున్నారు. అనుప‌మ సైతం కొన్నిసార్లు త‌న‌కు బుమ్రా అంటే చాలా ఇష్టం అని ప్రకటించింది. మరి నిజంగానే బుమ్రా, అనుపమ జంట ఒకటవబోతుందా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే…