తమిళనాడు మాజీ ముఖ్యమంతి దివంగత జయలలిత బయోపిక్ అంటే… అందులో తప్పనిసరిగా ఉండాల్సిన ఇద్దరు వ్యక్తులు శశికళ, శోభన్ బాబు. ఒకరు సినిమాల ద్వారా పరిచయమై ప్రేమను పంచితే…మరొకరు రాజకీయల్లో తనకు చేదోడువాదోడుగా నిలిచారు. వీళ్లిద్దరూ కూడా జయ జీవితంలో కాంట్రవర్సీ రేకెత్తించారు. ఎప్పటికీ వీడని సస్పెన్స్ ని క్రియేట్ చేసారు. కానీ తాజాగా రిలీజైన తలైవి ట్రైలర్ లో వీరిద్దరి క్యారెక్టర్స్ కనిపించలేదు. నిజానికి అమ్మగా కంగనా రనౌత్ తన నటనతో ఆకట్టుకుంది. మొత్తం ట్రైలర్ లో కూడా ఎక్కడా వంక పెట్టలేం అయితే ఇందులో శశికళ, శోభన్ బాబుల పాత్రలను రివీల్ చేయకపోవడంతో కొత్త చర్చ మొదలైంది. కోలీవుడ్ టాక్ ప్రకారం ‘శశికళ’ పాత్రలో హీరోయిన్ ‘పూర్ణ’ నటించింది. అలాగే ‘శోభన్ బాబు’ రోల్ ను బెంగాళీ నటుడు ‘జిష్షూ సేన్ గుప్తా’ పోషించారు. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాలనే ఉద్దేశ్యంతోనే వీరిద్దరినీ ట్రైలర్ లో చూపించలేదని తెలుస్తోంది.

తలైవి ట్రైలర్ వచ్చేసింది. తలైవి జయలలితగా కంగనా అద్దరగొట్టింది. సినిమా మొదలైనప్పుడు జయ క్యారెక్టర్…కంగనాకు సూట్ కాదన్న నోర్లకు ఈ ట్రైలర్ తోనే ఆమె తాళం వేసింది. దివంగత జయలలిత పాత్ర కోసం 20కేజీలు పెరిగి…మళ్లీ తగ్గానని రీసెంట్ గా చెప్పిన కంగనా…అది నిజమే అనిపించేలా కనిపించింది. ఇక ఏప్రిల్ 23న థియేటర్స్ కి రానున్న తలైవి సినిమాతో మరో నేషనల్ అవార్డ్ కు కంగనా వల వేస్తుందనే చెప్పొచ్చు.

నేడు కంగనా పుట్టినరోజు. ఈ బర్త్ డే ఆమె చాలా స్పెషల్. ఓ వైపు మణికర్ణిక, పంగా చిత్రాలకు గానూ తాజాగా ఉత్తమనటిగా జాతీయ అవార్డు వరించింది. మరోవైపు జన్మదిన కానుకగా రిలీజైన తలైవి ట్రైలర్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. హిందీతో పాటూ దక్షిణ భాషలన్నింటిలో విడుదల కాబోతున్న తలైవి ద్వారా చాలా వివరంగా తమిళనాడు రాజకీయాలను చూపించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

Source: Zeestudios