‘వలిమై’…తమిళ్ స్టార్‌ అజిత్‌ తాజాగా నటిస్తోన్న భారీ యాక్షన్‌ చిత్రం. ఈ సినిమాను బైక్‌ రేసింగ్‌ నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారు హెచ్‌. వినోద్‌ దర్శకుడు. బోనీ కపూర్‌ నిర్మాత. మన ‘ఆర్‌ఎక్స్‌100’ హీరో కార్తికేయ విలన్‌ పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్‌ భామ హ్యూమా ఖురేషీ హీరోయిన్. ఇక ఇదే సినిమాలో బాలీవుడ్‌ వర్సటైల్ యాక్టర్ జాన్‌ అబ్రహాం గెస్ట్ పాత్రలో కనిపించనున్నారని టాక్‌. వలిమైతో రేసర్‌ క్యారెక్టర్ లో జాన్‌ నటిస్తారట. రకరకాల బైక్స్, బైక్‌ రేసింగ్‌ అంటే జాన్‌ అబ్రహాంకి మహాసరదా. ఆ సరదాతోనే అజిత్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇదే నిజమైతే జాన్‌ అబ్రహాం నటిస్తోన్న తొలి తమిళ సినిమా వలిమై అవుతుంది.

ప్రభాస్ ‘సలార్’ గురించిన సరికొత్త న్యూస్ ప్రచారమవుతుంది. కేజీఎఫ్ చాప్టర్స్ తో క్రేజ్ పెంచుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ యాక్షన్ సాగా రూపొందనుంది. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్టులో విలన్ గా బాలీవుడ్ స్టార్ ‘ జాన్ అబ్రహం ‘ నటిస్తున్నాడని ఓ వార్త హల్చల్ చేస్తుంది.
కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్.. ఈ సలార్ ని సైతం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అందుకే పన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ని హీరోగా ఎంచుకుంది. అయితే ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్ర ఎంతో శక్తివంతంగా ఉంటుందట. సో.. ప్రభాస్ రేంజ్ కి సమానంగా..పాన్ ఇండియా లుక్ వచ్చేలా జాన్ అబ్రహం ను సెలెక్ట్ చేశారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అనుకున్నదే తడవుగా
కండల వీరుడు జాన్ అబ్రహమ్ ని విలన్ రోల్ కోసం సలార్ టీమ్ సంప్రదించటం.. జాన్ కూడా దాదాపు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మరి త్వరలోనే సలార్ లో జాన్ అబ్రహమ్ ఎంట్రీపై ఓ క్లారిటీ కూడా రానుంది.

ఇక సమ్మర్ లో రిలీజ్ కానున్న ప్రశాంత్ నీల్ డైరెక్టోరియల్ కేజీఎఫ్ ఛాప్టర్ 2లోనూ బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ఆదిపురుష్ లోనూ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు…ఇప్పుడిలా సాలార్ కోసం జాన్ అబ్రహం లాంటి నార్త్ హీరోనే వెతుకుతున్నారు. దీంతో ప్రభాస్ రేంజ్ కి ప్రస్తుతం బాలీవుడ్ హీరోలే… విలన్లుగా మారుతున్నారని చర్చ మొదలైంది.