వయసు ముదురుతున్నా ఫిజిక్ మెయిన్టైన్ చేస్తూ… డ్యాన్స్ మూవ్ మెంట్లలో ఎప్పటికప్పుడు ట్రెండ్ సృష్టిస్తోన్న హీరోయిన్ తమన్నా. ధర్టీ ప్లస్ భామ అయినా ఆ థాట్ రాకుండా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తాజాగా సంపత్ నంది డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా నటిస్తోన్న సీటీమార్ మూవీలో తమ్మూ చేసిన మాస్ సాంగ్ యూట్యూబ్ ని హీటెక్కిస్తుంది.
ఈ వీడియో సాంగ్ కు మూవీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తెలంగాణ పిల్ల, ఆంధ్రా పిల్లడా అంటూ సాగుతున్న ఈ పాటలో గోపీచంద్, తమన్నా మాస్ స్టెప్పులు ఎట్రాక్ట్ చేస్తున్నాయి. తెలంగాణ జానపద గీతం ”గొల్లా మల్లమ్మ కోడలా..’ తో పాటూ’నడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా’ అనే పాటలు అందరికీ తెలిసే ఉంటాయి. ఈ జ్వాలా రెడ్డి సాంగ్ వింటుంటే అవే పాటలు గుర్తొస్తుంటాయి. ఆ పాటల ట్యూన్ ను వాడేసుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. మరి క్రెడిట్స్ ఇస్తున్నారా లేదంటే లవ్ స్టోరి సారంగదరియాకు ఎదురైన అనుభవం..ఈ పాటకూ తప్పదా చూడాలి. కాగా సీటీమార్ ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమైంది.