పదహారేళ్ల తర్వాత రజనీ కాంత్ – కమల్‌ హాసన్ బాక్సాఫీస్‌ దగ్గర నువ్వా నేనా అనుకోబోతున్నారు. 2005లో సూపర్ స్టార్ ‘చంద్రముఖి’, యూనివర్సల్ స్టార్ ‘ముంబై ఎక్స్ ప్రెస్‌’ తమిళ ఉగాది పుత్తాండుకి పోటీపడ్డాయి. కాగా ఈ దీపావళికి ‘అన్నాత్తే’, ‘విక్రమ్‌’ ఒకేసారి రాబోతున్నాయని సమాచారం.

ఊరిపెద్దగా రజనీ నలుగురు హీరోయిన్లతో కలిసి నటిస్తోన్న చిత్రం అన్నాత్తే. నయనతార, కీర్తిసురేశ్, మీనా, కుష్బూ ప్రధానపాత్రలు పోషిస్తున్నారిందులో. గతంలో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కరోనా కారణంగా ఆగిన ఈ మూవీ షూటింగ్ మళ్లీ హైదరాబాద్ లోనే మొదలైంది. శివ డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమాని.

పోలీసాఫీసర్ గా కమల్ నటిస్తోన్న సినిమా విక్రమ్. మాస్టర్ ఫేం లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు ఈ చిత్రాన్ని. తమిళనాట ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చిన కమల్ హాసన్…ఈమధ్యే తిరిగి విక్రమ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కాగా అన్నాత్తేను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, విక్రమ్ ను కమల్ సొంత సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడ్యూస్ చేస్తోంది. మరి దీపావళికే ఈ రెండు సినిమాలు రంగంలోకి దిగుతాయని అంటున్నారు.

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘విక్రమ్’. తాజాగా ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రకు గానూ ఫహాద్ ఫాజిల్ ను ఎంపిక చేసారని సమాచారం. త్వరలోనే ఫాహద్ చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. చాలా తక్కువ టైంలోనే మలయాళ విలక్షణ నటుడిగా గుర్తింపుతెచ్చుకున్నారు ఫహాద్. తన యాక్టింగ్ స్కిల్స్ తో నేషనల్ అవార్డుతో సహా ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకున్నారు. ఇప్పుడు ఒక్క మలయాళంలోనే కాకుండా వివిధ భాషల సినిమా రంగాల నుంచి వరుస అవకాశాలు ఆయన్ని వరిస్తున్నాయి.

నిజానికి బన్నీ పుష్ప చిత్రంలో విజయ్ సేతుపతి నటించాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో పుష్ప నుంచి తప్పుకున్నారు సేతుపతి. అదే పాత్ర కోసం ఈమధ్యే ఫహాద్ ను ప్రకటించారు. ఆ క్యారెక్టర్ కు ఫహాద్ అయితేనే వందశాతం న్యాయం చేస్తారనే నమ్మకంతో డైరెక్టర్ సుకుమార్ ఈ స్టార్ ను సెలెక్ట్ చేసినట్టు టాక్. ఇక కమల్ హాసన్ కి విలన్ గా కూడా ప్రతిష్టాత్మక చిత్రం విక్రమ్ లో కూడా అదే నమ్మకంతో ఫహాద్ ను ఎంపిక చేసాడట డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.

భాగ్యచక్రం సినిమా షూటింగ్ జరుగుతోంది . ఆరోజు ఎన్టీఆర్, హాస్యనటుల పై ఓ సన్నివేశం జరుగుతోంది.”మిత్రమా ఇక్కడ అంతా చీకటిగా ఉంది నాకు చాలా భయం వేస్తోంది”అని ఆ హాస్యనటుడు ఎన్టీఆర్ తో డైలాగ్ చెప్పాలి దర్శకుడు కె.వి.రెడ్డి గారు రచయిత పింగళి గారిని పిలిచి ఈ చీకటి భయం అని డైలాగు చెప్పే బదులు ఆ హాస్యనటుడి ఫేసులో భయపెడుతున్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తే సరిపోతుంది కదా అని అన్నారట దానికి పింగళి గారు అది మీ ఇష్టం అందరికీ అర్థం కావడానికి అలా రాశాను అన్నారు అయిన. అక్కడే ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ మెదడులో ఒక కొత్త ఆలోచన ఉద్భవించిందట. డైలాగులు లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందని .అయితే ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి చాలా ఏళ్ళు పట్టింది. “ఓ నిరుద్యోగి భవిష్యత్తు కోసం ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాడు ఊహించని విధంగా అతనికి డబ్బు వల్ల సౌఖ్యాలను అనుభవించే అవకాశం వస్తుంది రానురాను అతనికి ఆ జీవితం విరక్తి కలుగుతుంది ఇదంతా క్షణికం అని తను సొంతంగా సంపాదించుకున్న దాంట్లోనే ఆనందం ఉంటుందని సత్యాన్ని తెలుసుకుంటాడు”మూకీ సినిమా కోసం సింగీతం అనుకున్న కథ ఇది .సింగీతం ఎనిమిది వేల అడుగులు సినిమాకు స్క్రిప్ట్ అనుకుని మొదలుపెట్టారు తీరా అది అది 16,000 అడుగులకు చేరింది దాంతో నాలుగు వేల అడుగుల సీన్స్ తీసేయాల్సి వచ్చింది మొదట అద్వైత అనే టైటిల్ అనుకున్నారు . కలలో నివసించే నిరుద్యోగి కథ కాబట్టి వేరే టైటిల్ బాగుంటుందని అనుకున్నారు.. అదే సమయంలో సింగీతం బెంగళూరులో పేరొందిన 24 సీట్ల చార్టెడ్ ఫ్లైట్ గుర్తుకు వచ్చింది దాని పేరు పుష్పక్ పురాణాల్లో కూడా పుష్పక విమానం గురించి టాపిక్ ఉంది మనిషి ఎప్పుడు ఆశల పుష్పక విమానం లో విహరిస్తూ ఉంటాడు అందుకే సింబాలిక్గా ఉంటుందని పుష్పక విమానం అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు ఈ కథ కమల్ కి చెబితే విన్న వెంటనే ఓకే చేశారు. కన్నడ రాజ్ కుమార్ వాళ్లయితే తమ సంస్థలో ఈ సినిమా చేద్దామని ఉత్సాహం చూపించారు. ఎల్వి ప్రసాద్ కి చెబితే డైలాగులు లేకుండా కథేంటి అన్నారు అయినా చాలామంది సింగీతంను నిరుత్సాహ పరిచారు ఓ కన్నడ చిత్రం డైరెక్ట్ చేస్తున్న టైంలో శృంగార నాగరాజ్ అని బిజినెస్ మాన్ సింగితం కు పరిచయం అయ్యారు. ఆయన కథ విని ప్రొడక్షన్లో మెంబర్ గా అవ్వడానికి సిద్ధపడ్డారు అలా కన్నడలో పుష్పక విమానం పేరుతో సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది.

సరికొత్త టెక్నాలజీతో రికార్డింగ్ – మిక్సింగ్ స్టూడియోను మనముందుకు తీసుకొచ్చింది వాయిస్ స్టోర్ సంస్థ. మీల్స్ ఆన్ వీల్స్ లా ఇప్పుడు రోడియో కాన్సెప్ట్ తో స్టూడియో ఆన్ వీల్స్ పేరుతో దీనిని డిజైన్ చేసారు. అంటే మేకర్స్ అవసరానికి తగ్గట్టు ఈ స్టూడియోను వారి చెంతకే నేరుగా తీసుకెళ్లే సౌలభ్యం ఉంది ఇందులో. ఇండియాలోనే ప్రప్రథమంగా ట్రెండీ టెక్నాలజీతో రూపొందిన ఈ రికార్డింగ్ అండ్ మిక్సింగ్ స్టూడియోను ప్రారంభించారు లోకనాయకుడు కమల్ హాసన్. అంతేకాదు సెలెబ్రిటీల్లో మొదటివ్యక్తిగా ఇలాంటి స్టూడియో ఆన్ వీల్స్ లో డబ్బింగ్ కూడా ట్రై చేసి యువతరాన్ని ఎంకరేజ్ చేసారు.

భారతీయుడు-2 షూటింగ్ మళ్లీ మొదలు కానుందని టాక్. ఇప్పటికే 60 పర్సెంట్ చిత్రీకరణ పూర్తయిందని.. మిగిలిన పార్ట్ కూడా త్వరగా స్టార్ డైరెక్టర్ శంకర్ పూర్తి చేస్తారని టాక్. ఐ, రోబో 2.0 చిత్రాల తర్వాత శంకర్ కి బ్యాడ్ టైమ్ నడుస్తోందని బాగా వార్తాలొచ్చాయి. ఈ క్రమంలోనే పలు కారాణాల వల్ల వాయిదాపడుతూ వస్తోన్న భారతీయుడు 2 ఇక మళ్లీ పట్టాలెక్కే పరిస్థితి లేదనీ చెప్పుకొన్నారు. అందుకు తగ్గట్టే రామ్ చరణ్ తో తన 15వ సినిమాను ప్రకటించి వార్తల్లో నిలిచారు శంకర్.

దిల్ రాజ్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం భారతీయుడు చెక్ పెట్టడంలేదట శంకర్. మిగిలిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసి…దగ్గరుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకొని…రిలీజ్ డేట్ ప్రకటించాకే చెర్రీ మూవీ కోసం వర్క్ చేస్తారట శంకర్. కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు.

సినీ ప‌రిశ్ర‌మ‌లో టాకీ చిత్రాలు రాకమందు మూకీ చిత్రాలు అలరించాయి. అయితే మాట్లాడే సినిమాలొచ్చాక మూకీకి ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. అయినా సరే కమల్ హాసన్ ఓ ప్రయోగం చేసారు. సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో పుష్పక విమానంలో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మాటలే లేకుండా తీసిన మూకీ సినిమా పుష్పక విమానంతో విజయం సాధించారు కూడా. అయితే కమల్ కి ప్రయోగలంటే మహా సరదా. నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు తాపత్రయపడుతుంటారు కమల్ హాసన్. ఇప్పుడలాగే విజయ్ సేతుపతి తమిళ్ తెరపై మెరుస్తున్నారు. తాజాగా గాంధీ టాక్స్ అంటూ సైలెంట్ గా రచ్చ చేయబోతున్నారు.
రీసెంట్ గా మ‌క్క‌ల్ సెల్వ‌న్ సేతుప‌తి విజయ్ మూకీ ప్ర‌యోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజ‌య్ సేతుప‌తి నటిస్తున్నాడంటేనే ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందనేంత క్రేజ్ తెచ్చుకున్నారు. రీసెంట్ మాస్టర్ కూడా విజయ్ సేతుపతి విశ్వరూపాన్ని చూపించింది. హీరోగా చిత్రాలు చేస్తూనే.. మ‌రోవైపు విల‌న్‌గా మెప్పిస్తన్నారు.. పాత్ర ఏదైనా త‌న స్పెషాలిటీని చాటుకుంటున్నారు. ఇప్పుడిక మాట‌లు లేని మూకీ సినిమాలో నటించేందుకు రెడీఅయ్యారు విజ‌య్ సేతుప‌తి. కిషోర్ పాండురంగ్ బేలెక‌ర్ డైరెక్షన్ లో ఈ మూకీ డ్రామా రూపొందుతుంది. గాంధీ టాక్స్ అనే టైటిల్‌తో ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. బ్యాగ్రౌండ్ మొత్తం క‌రెన్సీ నోట్ల‌తో నింపేయ‌డం హైలైట్ గా మారింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దీనిని ప్లాన్ చేసారు.