బాలీవుడ్‌ బిగ్ బాంబ్ కంగనా రనౌత్‌ మరోసారి ఫైరయింది. ఎప్పటిలాగానే బీటౌన్ మాఫియా అంటూ గురిపెట్టిన కంగనా.. ఈసారి ఆ రచ్చలోకి అక్షయ్‌ కుమార్‌ని లాగింది. మంచి చేసినా అక్షయ్ చివరికి వార్తల్లో నిలవాల్సివచ్చింది. అక్షయ్‌ వంటి టాప్‌ స్టార్స్‌ చాలామంది తనకు సీక్రెట్ గా ఫోన్‌ చేసి మొచ్చుకున్నారని ట్వీట్ చేసింది. జయలలితగా కంగనా నటించిన తాజా చిత్రం ‘తలైవి’. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌ కు పాజిటివ్ స్పందన లభించింది. జయలలితగా కంగనా ఒదిగిపోయిందంటూ ప్రశంసలు దక్కాయి.

ఆడియన్స్, క్రిటిక్స్…ఇలా అందరూ ప్రశంసిస్తున్నా…బాలీవుడ్ స్టార్స్ మాత్రం తలైవి ఊసెత్తలేదు.
ఈ పరిస్థితుల్లో తాజాగా తనకొచ్చిన రహస్య కాల్స్‌ గురించి కంగనా అభిమానులతో షేర్ చేసుకుంది. తలైవి ట్రైలర్ చూసి బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎందరో తనకు రహస్యంగా విషెస్ తెలియజేసారని వెల్లడించింది. అదే దీపిక పదుకొణే, ఆలియా భట్ వంటి హీరోయిన్లకైతే పబ్లిక్ పొగడ్తలు వస్తాయని…నన్నెవరూ పబ్లిక్ గా మెచ్చుకోరని చెప్పుకొచ్చింది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అక్షయ్ కుమార్ రీట్వీట్ చేయాలి.

మొత్తం 66 సినిమాల రిలీజ్ లతో 2021 ఫస్ట్ క్వార్టర్ ముగిసింది. ఇప్పుడు ఫోకస్ సమ్మర్ సీజన్ పై పడింది. ఓ వైపు కోవిడ్ 19 సెకండ్ వేవ్ సింప్టమ్స్ కనిపిస్తున్నా…ప్రేక్షకులనే నమ్ముకుని థియేటర్లకొచ్చేస్తున్నాయి భారీ సినిమాలు. 270కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ వర్గాలకి షాక్ ఇచ్చింది టాలీవుడ్.

ఏప్రిల్ నెల…టాలీవుడ్ కి కీలకంగా మారనుంది. ఈ నెలలో రిలీజయ్యే సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మేకర్స్. కోవిడ్ మళ్లీ తిరగబెట్టినా 270కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసి తగ్గేదేలేదంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఏప్రిల్ 2న నాగార్జున వైల్డ్ డాగ్ రిలీజ్ కి రెడీఅయింది. గోకుల్ చాట్ లుంబినీ పార్క్ పేలుళ్ల నేపథ్యం… ఎన్.ఐ.ఏ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ కథాంశంతో రూపొందింది ఈ యాక్షన్ థ్రిల్లర్. ఇప్పటికే ప్రమోషనల్ మెటీరియల్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. వైల్డ్ డాగ్ 30కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేస్తే…ఏప్రిల్ 2నే వస్తోన్న కార్తీ సుల్తాన్ 10కోట్ల బిజినెస్ చేసింది

ఏప్రిల్ 9న వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుండటంతో భారీగానే అంచనాలు పెరిగాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 150కోట్ల భారీ థియేట్రికల్ బిజినెస్ తో వస్తోన్న వకీల్ సాబ్ లాభాల బాట పట్టాలంటే..బంపర్ హిట్ కొట్టాల్సిందే. లైన్ లో వేరే మూవీ రిలీజ్ కూడా లేకపోవడంతో వకీల్ గట్టిగానే వాదిస్తాడనే ధీమా మీదున్నారు నిర్మాత దిల్ రాజు.

Pawan Kalyan Craze in theater VakeelSaab Grand Release

వకీల్ సాబ్ తర్వాత ఏప్రిల్ 16న శేఖర్ కమ్ముల లవ్ స్టోరి రిలీజవుతుంది. తెలంగాణ నేపథ్యంలో నాగచైతన్య- సాయిపల్లవి జంటగా నటించారు. సారంగదరియా పాటతో ఒక్కసారిగా లవ్ స్టోరీపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబో కావడంతో యూత్ హిట్ ఇస్తారని నమ్ముతున్నారు మేకర్స్. లవ్ స్టోరీ ఇప్పటికే 35కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

Naga chaitanya latest movie updates,sai pallavi latest movie updates,Love story movie updates,ahachitram

నాని.. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ సినిమా టక్ జగదీష్ తో ఏప్రిల్ 23న రాబోతున్నాడు. నిన్నుకోరి తర్వాత నేచురల్ స్టార్ పెర్ఫామెన్స్ .. శివ నిర్వాణ టేకింగ్ ఈ సినిమాకి ప్లస్ కానున్నాయని అంచనా. ఇక అదేరోజు హీరోయిన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగా కంగనా నటించిన తలైవి రిలీజ్ కానుంది. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్, మరెన్నో సర్ప్రైజెస్ తో తలైవి ముస్తాబైంది. టక్ జగదీష్ 35కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ సాధిస్తే…తలైవి 5కోట్ల రూపాయల బిజినెస్ చేయగలిగింది.

ఏప్రిల్ 30న రానా నటించిన విరాట పర్వం రిలీజ్ కానుంది. రానా, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ డ్రామా ఇది. అయితే 20కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన విరాటపర్వం వాయిదా పడే అవకాశం ఉందని టాక్. విరాట పర్వం స్థానంలో వెంకీ నారప్ప వచ్చే అవకాశం ఉంది. ఇలా ఏప్రిల్ లో రొటీన్ కి భిన్నంగా కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజవుతున్నాయి. వీటిలో ఏది హిట్ గా నిలుస్తుందో చూడాలి.

ఇద్దరూ చిన్న సినిమాలతో క్రేజీ స్టార్స్ గా ఎదిగారు. ఇద్దరూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బీజీగా మారారు. అయితే ఈ ఇద్దరికీ మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. ట్లీట్స్ తో షూట్ చేసుకుంటారు. మాటల బాంబులు పేల్చుకుంటారు. అయితే వీళ్లిద్దరికీ తగ్గట్టే..నేషనల్ అవార్డ్ ఒకరివైపు…ఫిలింఫేర్ అవార్డ్స్ మరొకరి వైపు ఉన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఈ హైడ్రామా ఏంటి….

కంగనా, తాప్సీ…వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటుంది. ఇద్దరూ నేషనల్ స్టార్స్. యాక్టింగ్ తో అదరగొడతారు. అయితే ఒకరంటే ఒకరికి పడదు. ప్రభుత్వానికి పూర్తి సపోర్ట్ గా కంగనా ప్రవర్తిస్తే…జరిగేది తప్పు అనిపిస్తే చెప్పడం తాప్సీకి అలవాటు. ఇక్కడే చెడింది ఇద్దరికీ. ట్విట్టర్ వేదికగా యుద్ధం చేసుకున్నారు. సూటిగా ట్వీట్స్ సంధించుకున్నారు. కంగనా ఒకడుగు ముందుకు వేసి బి గ్రేడ్ యాక్ట్రెస్ అంటూ తాప్సీని గట్టిగానే ఢీకొట్టింది.

తాజాగా ముంబైలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. 2020లో విడుదలైన బాలీవుడ్ సినిమాలకిగానూ ఈ అవార్డ్స్ అందించారు. తాప్సీ నటించిన తప్పడ్ సినిమా అనేక విభాగాల్లో అవార్డులు అందుకుంది. బెస్ట్ యాక్ట్రెస్ గా తాప్సీని అవార్డ్ వరించింది. బెస్ట్ ఫిల్మ్ తో పాటూ బెస్ట్ స్టోరీ, బెస్ట్ సింగర్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ ఇలా పలు విభాగాల్లో థప్పడ్ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను దక్కించుకుంది. అయితే 2020లోనే రిలీజైన కంగనా పంగా సినిమాకి ఎటువంటి అవార్డ్ రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఈమధ్యే ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో బెస్ట్ యాక్ట్రెస్ గా మణికర్ణిక, పంగా సినిమాలకు గానూ కంగనా అవార్డ్ సొంతం చేసుకుంది. ఫిలింఫేర్ అవార్డ్స్ చాలా నామినేషన్స్ లో కంగనా నటించిన పంగా మూవీ కూడా ఉంది. ఉత్తమనటి విభాగంలో తాప్సీతో పోటీపడింది కంగనా. కానీ థప్పడ్ సినిమా నుంచి తాప్సీనే ఉత్తమనటిగా ఎంపికచేసింది ఫిల్మ్ ఫేర్ టీం. ఇలా ఫిల్మ్ ఫేర్ టీం తాప్సీ థప్పడ్ సినిమాకి పట్టంగడితే…నేషనల్ అవార్డ్స్ జ్యూరీ తాప్సీ థప్పడ్ చిత్రాన్ని అసలు పట్టించుకోలేదంటున్నారు బాలీవుడ్ జనాలు.

30 ఏళ్ల క్రితం రిలీజైన మైనే ప్యార్ కియా సినిమా గుర్తుంది కదా…ఆ సినిమాలో తన అందచందాలతో అలరించి, కుర్రాళ్లు ఆరాధించిన హీరోయిన్ భాగ్య‌శ్రీని ఎవ్వరూ అంత తొందరగా మర్చిపోలేరు. అప్పటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ ఇప్పుడు త‌లైవి త‌ల్లిగా తన సరికొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. 11 ఏళ్ల అనంతరం బాలీవుడ్‌ రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. జ‌య‌ల‌లిత బయోపిక్ ఆధారంగా రూపొందిన త‌లైవి చిత్రంలో కంగ‌నా త‌ల్లి పాత్రలో నటించారు. మంగ‌ళ‌వారం విడుదలైన తలైవి మూవీ ట్రైల‌ర్‌ ను తీక్షణంగా గమనిస్తే…ఒక్కసారి ఆమె తళుక్కున కనిపించడం చూడొచ్చు. ప్రస్తుతం 52ఏళ్ల వయసున్న భాగ్య‌శ్రీ సునీల్‌శెట్టి హీరోగా నటించిన రెడ్ అలెర్ట్ మూవీలో చివరిసారి న‌టించారు. ఆపై 2019లో ఓ క‌న్న‌డ చిత్రం చేసినా.. బాలీవుడ్ సినిమా చేయడం మాత్రం ఇదే మొదటిసారి. నిజానికి ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రం ద్వారా భాగ్యశ్రీ తెరపై మళ్లీ కనిపిస్తుందనుకున్నారు. కానీ అంతకన్నా ముందే తలైవి ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక తాజాగా కంగ‌నా పుట్టినరోజు సంద‌ర్భంగా ఇద్దరు కలిసున్న మూవీలోని ఓ పిక్ ను షేర్ చేసారు భాగ్య‌శ్రీ.

తలైవి ట్రైలర్ వచ్చేసింది. తలైవి జయలలితగా కంగనా అద్దరగొట్టింది. సినిమా మొదలైనప్పుడు జయ క్యారెక్టర్…కంగనాకు సూట్ కాదన్న నోర్లకు ఈ ట్రైలర్ తోనే ఆమె తాళం వేసింది. దివంగత జయలలిత పాత్ర కోసం 20కేజీలు పెరిగి…మళ్లీ తగ్గానని రీసెంట్ గా చెప్పిన కంగనా…అది నిజమే అనిపించేలా కనిపించింది. ఇక ఏప్రిల్ 23న థియేటర్స్ కి రానున్న తలైవి సినిమాతో మరో నేషనల్ అవార్డ్ కు కంగనా వల వేస్తుందనే చెప్పొచ్చు.

నేడు కంగనా పుట్టినరోజు. ఈ బర్త్ డే ఆమె చాలా స్పెషల్. ఓ వైపు మణికర్ణిక, పంగా చిత్రాలకు గానూ తాజాగా ఉత్తమనటిగా జాతీయ అవార్డు వరించింది. మరోవైపు జన్మదిన కానుకగా రిలీజైన తలైవి ట్రైలర్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. హిందీతో పాటూ దక్షిణ భాషలన్నింటిలో విడుదల కాబోతున్న తలైవి ద్వారా చాలా వివరంగా తమిళనాడు రాజకీయాలను చూపించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

Source: Zeestudios

67వ జాతీయ అవార్డులను ప్రకటించారు. తెలుగులో ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’ చిత్రం చోటు సంపాదించుకుంది. ఉత్తమ హిందీ చిత్రంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా వచ్చిన ‘చిచ్చోరే’ ఎంపికైంది. కాగా మిగిలిన విభాగాల్లో బెస్ట్ కొరియోగ్రఫీ ‘మహర్షి’ సినిమాకి గానూ రాజు సుందరం, బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో ‘జెర్సీ’ సినిమాకి ఎడిటర్ నవీన్ నూలి, పాపులర్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రంగా ‘మహర్షి’ సినిమాలు నేషనల్ అవార్డును దక్కించుకున్నాయి. మొత్తంగా చూస్తే తెలుగులో మహర్షికి రెండు, జెర్సీకి రెండు నేషనల్ అవార్డులు దక్కాయి.

ఇక ‘అసురన్’ చిత్రానికి గానూ ధనుష్ జాతీయ ఉత్తమ నటుడిగా… ‘మణికర్ణిక’, ‘పంగా’ సినిమాలకు గానూ కంగనా రనౌత్ జాతీయ ఉత్తమనటిగా అవార్డును సంపాదించారు. అలాగే ‘సూపర్ డీలక్స్’ సినిమాలో అద్భుత నటన ప్రదర్శించిన విజయ్ సేతుపతి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డ్ వరించింది. బెస్ట్ మ్యూజిక్ ఫర్ సాంగ్స్ విభాగంలో అజిత్ నటించిన ‘విశ్వాసం’, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో ‘జల్లికట్టు’ చిత్రానికి అవార్డు దక్కింది.