కార్తీ, రష్మిక జంటగా నటించిన సుల్తాన్ టీజర్ రిలీజైంది. భాగ్యరాజ్ కన్నన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదలకు కూడా రెడీఅయింది. ఈ టీజర్ “మహాభారతం చదివావా?” అన్న మాటలతో ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు పాండవుల వైపు కాకుండా కౌరవుల పక్షాన ఉండుంటే? అదే మహాభారత గాధని యుద్ధమనేది లేకుండా ఊహించుకోండని చరిత్రపై ప్రశ్నలు సంధిస్తున్నాడు హీరో కార్తీ. కౌరవుల వైపు కృష్ణుడు అన్న కథాంశమే కొత్తగా ఉందిక్కడ. ఇక ఇందులో కార్తీ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.

రక్తం కారుతున్న చేతిని పట్టుకొని ఏదో ప్రమాణం చేస్తున్నట్టు చూపించారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ఈమెకిదే తమిళంలో మొదటి సినిమా. లవ్, యాక్షన్, డ్రామా, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలను కలుపుకుని సుల్తాన్ గా రంగంలోకి దిగారు కార్తీ. షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్‌ 2న రిలీజ్ కానుంది. ఖైదీ, దొంగ చిత్రాలతో మంచి ఫాంలో ఉన్న కార్తీ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ప్రేక్షకులకి.

Source: dream warrior pictures