రజనీకాంత్ .. నడిచొచ్చే ఎనర్జీ. 70 కి దగ్గరవుతున్నా..ఇంకా అదే ఎనర్జీ తో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్నారు. అయితే ఈ ఎనర్జీ ఈ మధ్య కాస్త డల్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో రజనీకాంత్ కి హెల్త్ బాలేకపోవడంతో అటు పొలిటికల్ స్పీడ్ కి , ఇటు సినిమాల స్పీడ్ కి బ్రేక్ పడింది. దాంతో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు .

దాదాపు రెండు నెలలనుంచి ఎటువంటి అప్ డేట్స్ ఇవ్వని రజనీకాంత్ .. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. అంతకుముందు అన్నాత్తే మూవీ కోసం రోజుకి 14 గంటలు కష్టపడిన రజనీకాంత్.. హెల్త్ బాలేకపోవడంతో షూటింగ్ ని కూడా పక్కన పెట్టేశారు. ఇక ఈ సినిమా ఇప్పట్లో ఉండదనుకున్నారు అంతా. అయితే రజనీ ఈ మన్త్ ఎండ్ కి గానీ , నెక్ట్స్ మన్త్ ఫస్ట్ వీక్ లో గానీ షూటింగ్ కి అటెండ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు.

శివ డైరెక్షన్లో బారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న అన్నాత్తే మూవీ ని దీపావళి కానుకగా నవంబర్ 4 న రిలీజ్ చేస్తున్నారు. ఇంకా 40 పర్సెంట్ షూటింగ్ మాత్రమే మిగిలున్న ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చెయ్యడానికి మళ్లీ రెడీ అవుతున్నారు రజనీ. అంతేకాదు .. ఈ సినిమా కంప్లీషన్ తర్వాత యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో మరో సినిమా చెయ్యడానికి సిద్దమవుతున్నారు తలైవా. ఇలా లేట్ వయసులో కూడా యంగ్ జనరేషన్ తో పోటీ పడుతూ మళ్లీ కమ్ బ్యాక్ అవుతున్నారు రజనీకాంత్.

‘పేట్ట’ తర్వాత మరోసారి సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుందనే టాక్ కోలీవుడ్‌ పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ డైరెక్షన్లో రజనీకాంత్‌ నటించిన సినిమా ‘పేట్ట’… సూపర్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ‘అన్నాత్తే’ అనే మాస్ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నారు రజనీకాంత్‌. నయనతార, కీర్తి సురేశ్, కుష్బూ, మీనా వంటివారు నటిస్తున్నారిందులో. ఇక ఈ సినిమా తర్వాతే కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్‌ విక్రమ్‌…ఇద్దరితో ఓ మల్టీస్టారర్‌ మూవీని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజ్‌. ఈ సినిమా పూర్తయ్యాకే రజనీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట.