ఆర్ ఎక్స్ 100 తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి టాలీవుడ్ కంట్లో పడ్డాడు ఈ హీరో. ఏదో ఫస్ట్ సినిమా కదా..ఫ్లూక్ లో వచ్చేసింది హిట్ అనుకున్నారు అందరూ. ఆ సినిమా క్రేజ్ తో ఆఫర్లు వచ్చినా .. సరైన సెలక్షన్ లేక మెయిన్ స్ట్రీమ్ లో తడబడ్డాడు కార్తికేయ. అయితే ఇప్పుడు తన్నకుండానే బూరెల బుట్టలో పడ్డాడు కార్తికేయ. టాప్ ప్రొడక్షన్ హౌజ్ లతో సినిమాలు చేస్తూ.. సత్తా చూపించుకోడానికి ట్రై చేస్తున్నాడు.
ఆర్ ఎక్స్ 100 తర్వాత చేసిన గుణ 369, హిప్పీ లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా .. తన లోని యాక్టింగ్ టాలెంట్ ని చూపించుకోడానికి విలన్ కూడా ట్రై చేశాడు. హీరోగా ఇంకా సక్సెస్ అవ్వనే లేదు.. అప్పుడే నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు కార్తికేయ. సినిమాలో నానికన్నా కార్తికేయ చాలాస్టైలిష్ గా కనిపించారనడంలో ఏమాత్రం డౌట్ లేదు.
గ్యాంగ్ లీడర్ తర్వాత చేసిన 90ఎమ్ ఎల్ అంతగా సక్సెస్ అవ్వలేదు . అప్పటికే కార్తికేయ టాలెంట్ చూసి అల్లు అరవింద్ .. గీతా ఆర్ట్స్ లో చావుకబురు చల్లగా సినిమా ఆఫర్ ఇచ్చారు. రీసెంట్ గా ఈ సినిమా ఫంక్షన్ కి బన్నీ అటెండ్ అయ్యి సినిమా మీద హైప్స్ క్రియేట్ చేశారు. కార్తికేయ ..బస్తీ బాలరాజు క్యారెక్టర్ చేస్తున్న సినిమా ఇంకా రిలీజ్ అవ్వనే లేదు .. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ బ్యానర్ లో సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందిస్తున్న సినిమాకి సెలక్ట్ అయ్యాడు కార్తికేయ. ఈ బస్తీ బాలరాజు స్టార్ బ్యానర్స్ లో సినిమాలు చేస్తూ…వరుస అవకాశాలు సంపాదిస్తున్నాడు.