‘ఏక్‌ థా టైగర్, టైగర్‌ జిందా హై’ సినిమాల తర్వాత మరోసారి కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏజెంట్‌ టైగర్‌గా మేకప్ వేసుకోనున్న సంగతి తెలిసిందే. టైగర్‌ సిరీస్ లో వస్తోన్న మూడో సినిమా ‘టైగర్‌ 3’. డైరెక్టర్ మనీష్‌ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్ లో కత్రినా కైఫ్‌ హీరోయిన్. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది.
సీరియల్ కిస్సర్ ఇమ్రాన్‌ హష్మీ టైగర్3లో విలన్‌గా నటింటబోతున్నారు. కండలవీరుడిని ఢీకొట్టే క్రూరమైన ప్రతినాయకుడిగా ఇమ్రాన్‌ రోల్ ఉంటుందట. వచ్చే మార్చి నెలలోనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసారు. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్‌ తర్వాత దుబాయ్‌ లో మిగిలిన భాగాన్ని చిత్రీకరించనున్నారు మేకర్స్. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో టైగర్ 3ను నిర్మించనుంది యశ్ రాజ్ ఫిల్మ్స్.

పులి అంటే టైగర్…అవును ఏజెంట్ టైగర్ గా కనిపించేందుకు సిద్ధమవుతున్ను సల్మాన్ ఖాన్. గతంలో ఆయన నటించిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కాగా తాజాగా మరోసారి టైగర్ అవతారం ఎత్తుతున్నారు. దుబాయ్ వేదికగా మార్చి నెలలో ప్రారంభంకానుందీ ప్రాజెక్ట్. డైరెక్టర్ మనీశ్ శర్మ డైరెక్ట్ చేస్తుండగా…యశ్ రాజ్ సంస్థ నిర్మించనుంది. పొడుగు కాళ్ల సుందరి కత్రినా కైఫ్ మరోసారి సల్మాన్ సరసన నటించబోతుంది. తొలి రెండు సినిమాల కంటే భారీ బడ్జెట్ తో ఈ కొత్త చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రారంభ షూటింగ్ లోనే యాక్షన్ సన్నివేషాలని షూట్ చేయాలనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను 2022 రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కత్రినా కైఫ్…ప్రస్తుతం వార్తల్లో పెద్దగా హల్చల్ చేయట్లేదీ పేరు. సల్మాన్, రణ్ బీర్ లతో లవ్ ఎఫైర్ బెడిసికొట్టాక కాస్త సైలంటయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీగా మారుతున్నారు. ఇక త్వరలోనే సౌత్ ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ అందించబోతున్నారు. కోలీవుడ్ సైలెంట్ స్టార్ విజయ్ సేతుపతితో త్వరలోనే ఓ సినిమాలో నటించబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తీయబోయే సినిమాలో విజయ్, కత్రినాలు జంటగా కనిపిస్తారట.
ఇప్పుడు తెలుగు, తమిళ్ లో రీమేక్ అవుతోన్న అంధాధూన్ సినిమాతో బాలీవుడ్ సూపర్ హిట్ కొట్టారు శ్రీరామ్ రాఘవన్. అప్పటినుంచి ఆడియెన్స్ ఈ డైరెక్టర్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి వరుణ్ ధావన్ హీరోగా ఎక్కిస్ అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసారు. కానీ వరుణ్ కూలీ నెంబర్ 1తో బీజీగా ఉండటంతో కార్యరూపం దాల్చలేదు. ఇక విజయ్ సేతుపతి, కత్రినా జంటగా అనుకొని స్క్రిప్ట్ పనులు చేస్తున్నారట. అయితే బాలీవుడ్ లో ఈ కాంబినేషన్ సంచలనాన్ని సృష్టిస్తోంది.