రేపు తెల్లవారితే ‘రంగ్ దే’, ‘అరణ్య’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రేపు గడిస్తే 27న వీటితో పాటూ రంగంలోకి దిగనుంది ‘తెల్లవారితే గురువారం’ సినిమా. నితిన్, కీర్తి సురేష్ నటించిన రంగ్ దే, రానా ఒంటి చెత్తో నడిపించిన అరణ్య…ఈ రెండు చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. రంగ్ దే కామెడీతో, అరణ్య థ్రిల్లర్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే రంగ్ దే చూసిన దిల్ రాజు, అరణ్య వీక్షించిన సురేష్ బాబు సంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కీరవాణి కొడుకులు కలిసి చేస్తోన్న ప్రయత్నం తెల్లవారితే గురువారంపై కూడా ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో రేపు తెలిసిపోతుంది. పెద్దగా పోటీ లేకపోవడంతో రెండు వారాలుగా జాతిరత్నాలు కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే రత్నాల ఊపు కూడా తగ్గుతుంది. దీనికి తోడు రంగ్ దే, అరణ్య సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ కొట్టినా, లేదంటే రెండు హిట్ టాక్ తెచ్చుకున్నా…జాతిరత్నాలు ఇంక ఓటీటీలో చూడొచ్చులే అనుకునే అవకాశం ఉంది ప్రేక్షకులు. ఏనుగుల నేపథ్యంగా తెరకెక్కిన అరణ్య గెలుస్తాడా…కామెడీనే నమ్ముకున్న నితిన్ హిట్ కొడతాడా…అసలేలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేని శ్రీసింహ తెల్లవారితే దచ్చికొడతాడా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

యూత్ స్టార్ నితిన్ – కీర్తి సురేష్ న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ రంగ్ దే. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైల‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్ వీడియోల‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ నెల 26న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ ఈవెంట్‌ని రాజ‌మండ్రిలో గ్రాండ్‌గా నిర్వహించారు. నితిన్, కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ అట్లూరితో పాటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ సైతం ఈవెంట్ లో సందడి చేసారు.
ఇదిలా ఉంటే రంగ్ దే చిత్రంలో హీరో నితిన్ న్యూడ్ గా కనిపించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి డైరెక్టర్ వెంకీ స్పందించారు. నితిన్ పూర్తిగా కాదు..హాఫ్ న్యూడ్ గా కనిపిస్తాడంటూ చమత్కరించాడు. నితిన్, కీర్తి సురేష్ ల మధ్య కాస్త ఘాటు సీన్స్ ఉన్న మాట వాస్తవమే కానీ మరీ న్యూడ్ గా నితిన్ చేయలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ ఇంటిమేట్ సీన్స్ కు సంబంధించి ట్రైలర్ లోనే చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్. మరి సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ప్రభాస్ ఆదిపురుష్ గురించి వార్త రాని రోజంటూ లేకుండా పోయింది. రామునిగా ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాలో సీతగా కృతిసనన్ అనీ, కీర్తి సురేశ్ అని రోజుకో ప్రచారం జరుగుతుంది. తాజాగా లక్ష్మణుడి గురించి అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ ఫేం విక్కీ కౌశల్ ప్రభాస్ తమ్మునిగా కనిపిస్తాడని అంటున్నారు. ఉరి..ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో మంచిపేరు తెచ్చుకున్నాడు విక్కీ. ప్రస్తుతం అశ్వద్ధామ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. కాగా ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా దాదాపు ఫిక్సయినట్టే అంటున్నారు. అంతకుముందు ఆదిపురుష్ కి సంబంధించి లక్ష్మణుడి పాత్రలో టైగర్ ష్రాఫ్ నటిస్తాడనే రూమర్ చక్కర్లు కొట్టింది.

బి టౌన్ స్టార్ హృతిక్ రోషన్, ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే వార్త జోరందుకుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాల దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ వీరిద్దరి కలయికలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వార్ తెరకెక్కించిన సిద్ధార్ధ్…ఇప్పుడు ప్రభాస్, హృతిక్ లను ఒకే ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాదు వీరిద్దరి మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను యష్ రాజ్ సంస్థ నిర్మించనుంది.

ప్రభాస్ రామునిగా నటించబోతున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో సీతగా నటించబోయేది ఎవరన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. కృతి సనన్ దాదాపు ఫిక్సయినట్టే అన్నారు. ఆ తర్వాత అనుష్కా శెట్టి పేరూ తెరపైకొచ్చింది. తాజాగా మహానటి కీర్తి సురేష్ సీతగా కనిపించే అంశాలు పుష్కలంగా ఉన్నాయనే వార్త జోరందుకుంది. ఆదిపురుష్ చిత్రంలో సీతగా కీర్తి ఫిక్సయినట్టేనని చెబుతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.

తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సాంగ్ విడుదల చేసారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సందర్భంగా మార్చి 26న విడుదలవుతున్న రంగ్ దే మూవీ యూనిట్ కు అభినందనలు తెలియజేసారు. రీసెంట్ గా రంగ్ దే మూవీ నుంచి విడుదలైన రెండు పాటలకు ఇటు మ్యూజిక్ లవర్స్ నుంచి, అటు ఆడియెన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్న తరుణంలో ఈ చిత్రం నుంచి మరో గీతం లిరికల్ వీడియో రూపంలో ఈరోజు విడుదల అయింది. చిత్ర కథ ప్రకారం సందర్భోచితంగా వచ్చే ‘రంగ్ దే’ లోని ఈ గీతం వివరాల్లోకి వెళితే

“నా కనులు ఎపుడూ కననే కనని
హృదయ మెపుడూ విననే వినని
పెదవు లెపుడూ అననే అనని
అద్భుతం చూస్తూ ఉన్నా…”
అంటూ పల్లవితో సాగే ఈ గీతానికి శ్రీమణి లిరిక్స్ అందించారు. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఉప్పెన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన చిత్రమిది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Source: Aditya music

ఈమధ్య వరుసగా క్రీడా కథాంశంతో సాగే చిత్రాలు వెండితెరకు క్యూ కడుతున్నాయి. అలాంటిదే కీర్తి సురేష్ లీడ్ రోల్ చేసిన ‘గుడ్‌లక్‌ సఖి’. అయితే గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు డైరక్టర్ నగేష్‌ కుకునూర్‌. ఇక ఈ సంవత్సరం జూన్‌ 3వ తేదీన ‘గుడ్‌లక్‌ సఖి’ని రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇటీవలే ప్రకటించింది. జగపతి బాబు ఆది పినిశెట్టి కీలక పాత్రలు చేసారిందులో. దక్షిణాది భాషలు తెలుగు, తమిళం, మలయాళ ఇండస్ట్రీల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ సుధీర్‌చంద్ర పాదిరి. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించడం విశేషం.

కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా కొత్త ప్రాజెక్ట్ స్టార్టయింది. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇటీవలే ప్రారంభోత్సవాన్ని జరుపుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మాత్రం గతేడాదే విడుదలైంది. మాస్ లుక్ లో కీర్తి సురేష్ ను చూసి షాకయ్యారు ఫ్యాన్స్. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో కలిసి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నారు కీర్తి సురేష్. ఈ ప్రాజెక్ట్ కు సాని కాయిదమ్ అనే టైటిల్ ను తమిళంలో ఫిక్స్ చేసారు.

పెద్దన్నయ్య అంటే నందమూరి బాలకృష్ణ సినిమా కాదు. రజినీకాంత్ ‘అన్నాత్తే’. అన్నాత్తే అంటే తెలుగులో పెద్దన్నయ్య. అవును రజినీకాంత్ తిరిగి అన్నాత్తే చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ తదితరులు నటిస్తున్నారు. గతేడాది డిసెంబరులో హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అన్నాత్తే’ చిత్ర షూటింగ్‌ను లాక్ డౌన్ తర్వాత స్టార్ట్‌ చేశారు. కానీ మూవీ యూనిట్ లో కొందరు కరోనా బారిన పడటంతో చిత్రీకరణ నిలిచిపోయింది. అదే సమయంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి కుదుటపడ్డాక చెన్నై చేరుకున్న రజినీకాంత్…మళ్లీ షూటింగ్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారట. దీంతో అన్నాత్తేను రీస్టార్ట్ చేసేందుకు డైరెక్టర్ శివ ప్లాన్ చేస్తున్నారు. మార్చి 15వ తేదీన షూటింగ్ ఆరంభించడానికి రెడీ చేస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌లోనే సూపర్ స్టార్ కూడా పాల్గొనబోతున్నారట. ఇప్పటికే సినిమా చిత్రీకరణకు బాగా ఆలస్యమైందని…నటీనటుల కాల్షీట్స్‌ సమస్య తలెత్తకుండా అన్నాత్తే షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ నవంబరు 4న ‘అన్నాత్తే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సర్కారు వారి పాట దుబాయ్ షెడ్యూల్ తాజాగా పూర్తి కాగా, నెక్ట్స్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేసారట. దుబాయ్ లో మొదటి రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఎట్టకేలకు పూర్తిచేసింది మూవీ యూనిట్. కాగా ఇప్పుడు గోవా సముద్ర తీరంలో చిత్రీకరణ ప్రారంభించేదుకు సన్నాహాలు చేస్తోంది. ఈ షెడ్యూల్‌లో మహేశ్ బాబుపై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట తెర‌కెక్కించ‌నున్నార‌ని స‌మాచారం.

అయితే సర్కారు వారి పాటలో లీడ్ హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటిస్తుండగా…కథను మలుపుతిప్పే కీలక పాత్ర కోసం మరో హీరోయిన్ ను సెర్చ్ చేస్తున్నారు. కాగా ఆ రోల్ లో ఓ స్టార్ హీరోయినే కనిపిస్తుందని టాక్. పాత్ర చిన్నదైనా కథపై గట్టి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది గనుక ఓ స్టార్ హీరోయిన్ అయితేనే కరెక్ట్ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మహేశ్ బాబుతో పాటూ ఆమెకు ఓ పాట కూడా ఉంటుందని సమాచారం. అందుకోసమే అనుష్క, కాజల్ వంటి వారిని సంప్రదిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు పరశురామ్ కాంబో మూవీ సర్కారు వారి పాట శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిన్న బ్రేక్ తీసుకొని చిటికెలో వచ్చేస్తా అన్నట్టు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా దుబాయ్ లోనే మొదలుపెట్టారు. మూవీ చిత్రీకరణ కోసం తాను దుబాయ్ వెళుతున్నట్టు హీరోయిన్ కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేశారు. అయితే ఈసారి మహేశ్ బాబు, కీర్తి సురేశ్ లపై సాంగ్ షూట్ కూడా జరగబోతోంది.

సర్కారు వారి పాట సినిమా సెకండ్ ఫెడ్యూల్ కంప్లీట్ కాగానే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు మూవీ టీమ్. అక్కడి షూటింగ్ లోకేషన్స్ తో చిన్న ప్రోమో వీడియో రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, కీర్తి సురేశ్, తమన్ వంటివారు సినిమా లోకేషన్స్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. కాగా ఇప్పుడిక చిన్న ప్రోమోతో అతితొందరలో కనిపించనున్నారు.