కేజీఎఫ్ చాప్టర్ 2 షూట్ పూర్తవడంతో ఫ్రీ బర్డ్ అయిపోయారు హీరో యష్. ఇన్నాళ్లు పడిన శ్రమను మర్చిపోయేందుకు తనకు నచ్చినచోట వాలిపోతున్నారు. చాప్టర్ 2కు ప్యాకప్ చెప్పినవెంటనే తమిళనాడులోని ప్రముఖ శనీశ్వరాలయాన్ని దర్శించారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు రమేశ్ అరవింద్ కూతురి పెళ్లికి అటెండ్ అవడమే కాదు డాన్స్ చేసి మరీ సందడి చేసారు. నెక్ట్స్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ ఓపెనింగ్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసి టీంని ఉత్సాహపరిచారు.

ఇప్పుడిక మాల్టీవుల్లో రచ్చ చేస్తున్నారు యష్. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి మాల్టీవుల విహారయాత్రకు వెళ్లారు. భార్య రాధిక పండిట్, కొడుకు, కూతురుతో కలిసి ఫోటోలు దిగుతూ…వాటిని అభిమానులతో పంచుకుంటూ ట్రెండింగ్ గా మారుతున్నారు. స్వర్గం అంటే ఇలానే ఉంటుందా అంటూ మాల్టీవుల గురించి కామెంట్ చేసి వావ్ అనిపించారు. ఇలా రాకింగ్ స్టార్ ఏది చేసినా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by Yash (@thenameisyash)

ఇండియన్ బాక్సాఫీస్ మీదకు దండయాత్ర చేయడానికి రెడీగా ఉన్న చిత్రాల్లో కే జి ఎఫ్ చాప్టర్ 2 ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి అలాగే ఈ భారీ చిత్రం నుంచి వచ్చిన లేటెస్ట్ టీజర్ తో అయితే అవి కూడా దాటేసి టీజర్ అయితే వచ్చింది సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
అయితే ఈ క్రమంలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన భార్య రాధిక పండిత్ తో కలిసి మిడ్ నైట్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తుండగా వాళ్ళ ఫ్యాన్స్ 5,700 కేజీల కేక్ 216 అడుగుల కటౌట్ కట్టి తనని సర్ప్రైజ్ చేశారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే తను ఏ బస్టాండ్లో లో అయితే సినిమా పరిశ్రమ లోకి వచ్చిన మొదట్లో పడుకునేవాడో ఆ బస్ స్టాండ్ దగ్గరే అంత పెద్ద కటౌట్ ని సంపాదించుకున్నాడు..

నిన్న హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన కేజీఎఫ్ టీజర్ కొత్త రికార్డులను సృష్టిస్తుంది. 24 గంటలు కాకముందే 25 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు యూట్యూబ్ లో నంబర్ 1 పొజిషన్ లో ట్రెండింగ్ కొనసాగిస్తుంది.
వేసవిలో సినిమా విడుదలకు ముస్తాబవుతున్న ఈ మూవీ టీజర్ తోనే భారీగా అంచనాలు పెంచేసింది. చాప్టర్ 1కు మించి రికార్డులను ఈ చాప్టర్ 2 తిరగరాయనుందనే సంకేతాలను అందిస్తుంది.

Source: Hombale Films

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది కేజీఎఫ్ చాఫ్టర్ 2. అయితే ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్ ను ఎనౌన్స్ చేసారు. జనవరి 8 ఉదయం 10 గంటల తర్వాత ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తారట. ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం ఎనౌన్స్ చేసింది. చాప్టర్ 1 తర్వాత భారీ అంచనాలు నెలకొన్న చాప్టర్ 2 పై ఈ టీజర్ తో ఓ క్లారిటీ వస్తుంది. ఆకాశమే హద్దుగా సాగుతున్న ప్రేక్షకుడి ఊహను ప్రశాంత్ నీల్ అందుకున్నాడా అన్నది తెలుస్తుంది.
ఇక హీరో యష్ దైవ ఆశీర్వదం కోసం తమిళనాడులో పేరుగాంచిన తిరునల్లార్ శనీశ్వర్ ఆలయాన్ని దర్శించాడు. ప్రపంచం కళ్లు ఉన్న సినిమా కాబట్టి ఎలాంటి ఆటంకం ఎదురుకాకూడదని యష్ కోరుకుంటున్నాడు. అయితే కేజీఎఫ్ టీంతో కాకుండా కర్ణాటక డిప్యూటి సిఎం తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. దీంతో ఈరకంగా కేజీఎఫ్ ప్రచారానికి తెరలేపాడా అన్న ఆసక్తిని కలిగించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమవుతున్న చిత్రబృందం పాన్ ఇండియా లెవల్ ప్రమోషన్స్ కు ప్లాన్ చేస్తుంది.

డిసెంబరు 21 అనగానే కేజీఎఫ్ ఫ్యాన్స్ కి గుర్తొచ్చేది రిలీజ్ డేట్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్‌ హీరోగా తెరకెక్కిన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్‌’ విడుదలైంది…2018 డిసెంబర్‌ 21న. ఆ రోజున ఏ ముహూర్తాన తెరపై సినిమా పడిందో కానీ ఘన విజయం సాధించటమే కాదు యశ్‌కు సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్ కారణంగానే ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌-2’ తెరకెక్కుతోంది. గతేడాది డిసెంబర్‌ 21న ‘కేజీఎఫ్‌-2’ నుంచి యశ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ ఏడాది ఇదే రోజున సీక్వెల్ ను సైతం రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా గ్యాప్ రావడంతో అది కుదరలేదు. కానీ డేట్ సెంటిమెంట్ ను వదిలే ప్రసక్తే లేదంటుంది చిత్రయూనిట్.

మరోసారి కూడా సెంటిమెంట్‌ను రీపీట్‌ చేసేందుకు సిద్దమవుతోంది. తమకి ఎంతో కలిసొచ్చిన డిసెంబర్‌ 21న ప్రేక్షకులకు ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ఓ ట్వీట్‌ చేసారు. ‘కేజీఎఫ్‌-2’ ముగింపుకు మేము చేరువలో ఉన్నాం. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 21న అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేసిన మేము ఈ ఏడాది కూడా అదే ఆచారాన్ని కొనసాగించేందుకు రెడీ అవుతున్నాం. మా అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల వేదికగా.. డిసెంబర్‌ 21న ఉదయం 10.08 గంటలకు… స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాం. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నందుకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. రాకీభాయ్‌ ఇచ్చే స్పెషల్‌ సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.