రాజావారు- రాణిగారు తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం, సెబాస్టియన్ చిత్రాలతో బిజీగా మారిన కిరణ్ అబ్బవరం…కలర్ ఫోటో తర్వాత మెరుస్తున్న చాందినీ చౌదరి కలిసి నటించబోతున్న కొత్త చిత్రం సమ్మతమే. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తాజాగా ప్రారంభమైంది. కె. ప్రవీణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
భువనగిరి ఎం.ఎల్.ఏ. పైలా శేఖర్ రెడ్డి క్లాప్ కొట్టగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హీరో, హీరోయిన్ లపై కెమెరా స్విఛ్ ఆన్ చేసారు. ఇక ఈ నెల 9 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తున్నారు. మార్చి ఫస్ట్ వీక్ వరకు షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారీ సినిమాకి.