వచ్చిండే పిల్లా అంటూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మళ్లీ తన నటనతో మాయ చేసేందుకు సిద్ధమయ్యారు. బావబామ్మర్దులు నాగచైతన్య – రానాలు హీరోలుగా తెరకెక్కిన రెండు సినిమాలతో తన దూకుడును చూపిస్తున్నారు సాయి పల్లవి. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె తెలంగాణ యువతిగానే కనిపించడం విశేషం. మౌనికగా లవ్ స్టోరిలో నటించగా…వెన్నెలగా విరాటపర్వంలో మెరవనున్నారు.

తాజాగా విరాటపర్వం నుంచి కోలు కోలు అంటూ అచ్ఛమైన తెలంగాణ పదాలతో ఓ పాట రిలీజైంది. ఈ పాటతో పాటూ అందులోని సాయి పల్లవి అభినయానికి దాసోహమవుతున్నారు ప్రేక్షకులు. ఓ వైపు ఈ పాట ట్రెండింగ్ లో ఉండగానే అటు లవ్ స్టోరీ నుంచి సారంగ దరియా అంటూ సందడి చేసేందుకు రెడీఅయ్యారు సాయిపల్లవి. మంగ్లీ పాడిన ఈ పాట వచ్చాడే పిల్లాలా ఫిదా చేస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. పూర్తి పాట చై వైఫ్ నాగసమంతా చేతులమీదుగా 28న విడుదలకానుంది.

Source: T Series