మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో మరింత జోష్ నింపేలా మేకర్స్ వరుసగా సర్పైజెస్ ఇస్తున్నారు. అడ్వాన్స్ విషెస్ తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ నుంచి సీతారామరాజుగా చెర్రీని పరిచయం చేసారు రాజమౌళి. ఇక తాజాగా తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తోన్న ఆచార్య నుంచి సిద్ధగా ఎంట్రీ ఇచ్చాడు చరణ్. “నీతో నటించాలన్న కోరిక నెరవేరింది నాన్న… ఇంతకు మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది” అంటూ ట్వీట్ చేసారు రామ్ చరణ్. చిరూతో కలిసి తుపాకులతో నడుస్తోన్న ఈ ఫస్ట్ లుక్ మెగాఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. కాగా చిరూ తాజాగా లీక్ చేసినట్టు మావోయిస్తు పాత్రల్లోనే దర్శనమిచ్చారు తండ్రికొడుకులు.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ కూడా ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈమధ్యే అటు మారేడుమిల్లి అడవుల్లో…ఇటు ఇల్లందు బొగ్గుగనుల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఇక మెగాస్టార్ సరసన కాజల్ కిచ్లూ నటిస్తుంటే…మెగాపవర్ స్టార్ జోడీగా పూజా హెగ్దే మెరవనుంది. మే 13న థియేటర్స్ కు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఆచార్య సిద్ధమవుతున్నాడు అంటూ రామ్ చరణ్ కొత్త ఫోటోను షేర్ చేసారు కొరటాల శివ. ప్రస్తుతం రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోన్న ఆచార్య సెట్స్ నుంచి చెర్రీ ఫోటోను కొరటాల శివ పోస్ట్ చేయగా…అది నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ వెనుకవైపు నుంచి కనిపిస్తుండగా…ఆయన భుజంపై చిరంజీవి చేయివేసిన దృశ్యం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే కొరటాల కామెంట్ కి స్పందించారు రామ్ చరణ్. ఆచార్య సెట్లో డైరెక్టర్ కొరటాల శివతో పాటూ తండ్రి చిరంజీవితో ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నానన్నారు రామ్ చరణ్.

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా ప్రారంభమైంది. మోహన్ రాజా డైరెక్షన్ లో లూసీఫర్ రీమేక్ అఫీషియల్ గా లాంచ్ అయింది. అయితే మన నేటివిటీకి తగ్గట్టు కథను పూర్తిగా మార్చి తెరకెక్కిస్తున్నారట ఈ సినిమాని. సురేఖ కొణిదెల సమర్పిస్తుండగా… కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇంకా ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ కలిసి ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నాయి. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మరి నయనతార, సత్యదేవ్ వంటి వారు ఉన్నారో లేదో తెలిసిపోతుంది.

ఈ మూవీ ఓపెనింగ్ బుధవారం ఫిలింనగర్ సూపర్ గుడ్ సంస్థ ఆఫీస్ లో పూజ కార్యక్రమంతో మొదలయింది. అల్లు అరవింద్, అశ్వినీదత్, డివివి దానయ్య, ఆర్ బి చౌదరి, నిరంజన్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నాగబాబు, డైరెక్టర్ కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమిని కిరణ్, బాబీ, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, గోపి ఆచంట, రామ్ ఆచంట, మిరియాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, యువి క్రియేషన్స్ విక్కీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.