కరోనా కాటు తర్వాత సంక్రాంతి కానుకగా ఓ పెద్ద సినిమా రాబోతోంది అనుకుంటే…ఆదిలోనే అవాంతరం ఎదురైంది. రవితేజ క్రాక్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకి పొద్దుపొద్దున్నే నిరాశే మిగిలింది.
ఆర్థిక లావాదేవీల కారణంగా థియేటర్స్ లో క్రాక్ సినిమా పడలేదు. ప్రొడ్యూసర్ కి, చెన్నై ఫైనాన్షియర్ కి మధ్య మనీ మాటర్ ముదరటంతో వివాదం రాచుకుంది.

ప్రస్తుతం చెన్నై కోర్టు వరకు ఈ వివాదం వెళ్ళింది. ఈ గొడవల నడుమ మార్నింగ్ ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. 11గంటల నూన్ షో కూడా కాన్సిల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 12గంటల నుంచి షోలు పడతాయని నిర్మాత సన్నిహితులు చెబుతున్నారు. ఇక మార్నింగ్ షోలకు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బులు వాపస్ ఇచ్చేశారు థియేటర్ సిబ్బంది. దీంతో ట్విట్టర్ వేదికగా తమ నిరాశను..ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆడియెన్స్.

రవితేజ రీసెంట్ టైం మోస్ట్ అవైతెడ్ ఫిలిం క్రాక్ ఎట్టకేలకు రిలీజ్ అయింది సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన క్రాక్ మాస్ ప్రేక్షకులకు కిర్రాక్ పుట్టించిందనే చెప్పాలి ఈ చిత్రం సంక్రాంతి యునానిమస్ హిట్
అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అయితే కథ విషయానికొస్తే ఒక సీరియస్ కేసు దృష్ట్యా ఒక సిన్సియర్ ఆఫీసర్కి ఆ కేసు వెళ్లడం ఆ కేసు వెనక ఉన్న ముగ్గురు నిందితులు తమను తాము రక్షించేందుకు ప్రయత్నించడం మన పోలీస్ ఆఫీసర్ వాళ్ళని పట్టుకుని ముప్పుతిప్పలు పెట్టడం చివరికి వాళ్ళ ని ఎలా పట్టుకున్నాడు అనేదే కథ ఈ కథ అన్ని కమర్షియల్ సినిమాల్లాగే రొటీన్ గానే ఉన్నా కథనం స్క్రీన్ప్లే మాత్రం చాలా అద్భుతంగా డీల్ చేశారు
Positives : రవి తేజ డైలాగ్ డెలివరీ ,శృతిహాసన్ యాక్టింగ్, కెమిస్ట్రీ ,మాస్ ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ ఫైట్, ,డైలాగ్స్ ,సాంగ్స్ ,బి జి యం

వీరలక్ష్మి శరత్ కుమార్ సముద్రఖని అలీ దేవి ప్రసాద్ మౌర్యాని సుధాకర్ వంశీ చాగంటి వారి వారి పాత్రల తో ఆకట్టుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి
Negitives :ఈ సినిమా లెంగ్త్ విషయానికి వస్తే కొంచెం లెగ్ అనిపించినా మా సీన్స్ వల్ల అది పెద్దగా తెలియదు ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది

“ఆహా చిత్రం రేటింగ్ “”4/5″”

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 4.00 out of 5)
Loading...