పిచ్చి కాదు తమది ప్రేమంటుంది పూజా హెగ్దే. ఈ లవ్ స్టోరీ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని ఆమె మాటలవర్షం కురిపిస్తుంది. డార్లింగ్ ప్రభాస్ జోడీగా ఆమె నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. జూలై 30వ తేదీన విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌ను మూవీయ యూనిట్ రిలీజ్ చేసింది. ‘రాధేశ్యామ్‌’ తో పాటూ వెంకీ ‘నారప్ప’తో, రవితేజ ‘ఖిలాడీ’తో హల్చల్ చేస్తున్నారు. మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. ‘అన్నం’: పరబ్రహ్మ స్వరూపం అనే పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. టక్ జగదీష్, మోసగాళ్లు, ఇదే మా కథ, గ్యాంగ్ స్టర్ గంగరాజు వంటి సినిమాల నుంచి కూడా మహాశివరాత్రి స్పెషల్ పోస్టర్స్ వచ్చేసాయి.

కృష్ణవంశీ సినిమాలంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది. భారీ తారాగణమే కాదు…స్పెషల్ స్టోరీ
ట్రీట్మెంట్ కనిపిస్తుంది. ప్రస్తుతం రంగమార్తాండ సినిమాతో బిజీగా ఉన్న క్రియేటివ్ డైరెక్టర్… మహిళా ప్రాధాన్యం ఉన్న సబ్జెక్ట్ త సినిమా తీసేందుకు రెడీగా ఉన్నారట. అయితే ఇందులో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ మూవీతోనే బాలీవుడ్‌ హీరోయిన్ జాన్వీ కపూర్‌ తెలుగు తెరకు పరిచయం అవుతుందనే టాక్ ఊపందుకుంది.

లాక్‌డౌన్‌ టైంలో కృష్ణవంశీ ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసారట. దానికి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం. ఇదే సమయంలో జాన్వీ కపూర్ లీడ్ రోల్ చేసిన ‘గుంజన్‌సక్సేనా: ది కార్గిల్‌గర్ల్‌’ చూసిన కృష్ణవంశీ…ఆయన రాసుకున్న స్టోరీకి జాన్వీ అయితేనే న్యాయం చేస్తుందని భావించారట. ఈ విషయమై ఇప్పటికే బోనీకపూర్‌తో సంప్రదింపులు కూడా జరిపారట. కానీ అటు నుంచి సమాధానం రావాల్సిఉంది. తెలుగు అంతఃపురం చిత్రాన్ని బోనీ నిర్మాతగా హిందీలో ‘శక్తి: ది పవర్‌’ గా రూపొందించారు కృష్ణవంశీ. అప్పటినుంచి కృష్ణవంశీ, బోనీకపూర్ మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంది. ఇక జాన్వీ కపూర్ తప్పకుండా కృష్ణవంశీ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనే చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ నటించిన రూహి విడుదలకు సిద్ధమైంది. ‘గుడ్‌లక్‌జెర్రీ’, ‘దోస్తానా2’ లాంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది.