సర్కారు వారి పాట తర్వాత మహేశ్ బాబు నటించబోయే సినిమా ఏంటన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. దర్శకధీర రాజమౌళి సినిమా ఉంటుందన్నది పక్కా. కానీ జక్కన్న పూర్తి కథతో రావడానికి కాస్త టైం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఇంకో 30రోజుల షెడ్యూల్ ఉంది. ఆ తర్వాత గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ అవుతారు రాజమౌళి. త్రిపుల్ ఆర్ ప్రచార కార్యక్రమాలు, సక్సెస్ సెలెబ్రేషన్స్ ఎంజాయ్ చేసాక గానీ మహేశ్ సినిమాకు అడుగులు ముందుకు పడవు.

పరుశురామ్ సర్కారువారి పాటకు…రాజమౌళి సినిమాకు మధ్యలో వచ్చే గ్యాప్ ను అనిల్ రావిపూడితో పూరిద్దామనుకుంటున్నారట మహేశ్ బాబు. అనిల్ రావిపూడి చాలాత్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేసేస్తాడు. అందులోనూ అనిల్ చెప్పిన కథ మహేశ్ కి బాగా నచ్చడంతో సరిలేరు నీకెవ్వరూ తర్వాత మళ్లీ ఈ కాంబో ఉంటుందని చెప్తున్నారు. అయితే వీళ్లిద్దరితో పాటూ హీరోయిన్ కృతిశెట్టి కలవనుందని టాక్. ఇప్పటికే అనిల్ రావిపూడి కథకు తగ్గ ప్లాన్ అమలు చేస్తున్నాడని, కృతిని కూడా మహేశ్ సరసన ఫైనల్ చేసినట్టేనని వార్తలొస్తున్నాయి.