ఫస్ట్ సినిమాతోనే కెరీర్ బెస్ట్ సినిమాను చూపించి…అందర్నీ అట్రాక్ట్ చేసిన ముద్దుగుమ్మ తెలుగువారి బేబమ్మ…కృతిశెట్టి. ఉప్పెన రిలీజ్ కాకముందు నుంచే అమ్మడికి అవకాశాలు ఉప్పెనలా వెల్లువెత్తాయి. చిరూ చెప్పినట్టు ఇప్పుడు కృతి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’… రామ్, లింగుస్వామి ప్రాజెక్ట్, సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి సినిమాలు ఇప్పుడామే చేతిలో ఉన్నాయి.

తాజాగా తమిళ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అవకాశాన్ని బేబమ్మ అందుకున్నట్టు చెప్తున్నారు. ధనుష్ హీరోగా మారి, మారి2 సినిమాలను తెరకెక్కించిన బాలాజీ మోహన్ మరోసారి ధనుష్ కాంబోలో ఓ చిత్రాన్ని రుపొందించనున్నాడు. ఇందులోనే కృతిశెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేసారని సమాచారం. కోలీవుడ్ ఎంట్రీనే ఓ స్టార్ హీరో సినిమాతో అంటే కృతి తమిళ్ ఇండస్ట్రీలోనూ చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.

సర్కారు వారి పాట తర్వాత మహేశ్ బాబు నటించబోయే సినిమా ఏంటన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. దర్శకధీర రాజమౌళి సినిమా ఉంటుందన్నది పక్కా. కానీ జక్కన్న పూర్తి కథతో రావడానికి కాస్త టైం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఇంకో 30రోజుల షెడ్యూల్ ఉంది. ఆ తర్వాత గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ అవుతారు రాజమౌళి. త్రిపుల్ ఆర్ ప్రచార కార్యక్రమాలు, సక్సెస్ సెలెబ్రేషన్స్ ఎంజాయ్ చేసాక గానీ మహేశ్ సినిమాకు అడుగులు ముందుకు పడవు.

పరుశురామ్ సర్కారువారి పాటకు…రాజమౌళి సినిమాకు మధ్యలో వచ్చే గ్యాప్ ను అనిల్ రావిపూడితో పూరిద్దామనుకుంటున్నారట మహేశ్ బాబు. అనిల్ రావిపూడి చాలాత్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేసేస్తాడు. అందులోనూ అనిల్ చెప్పిన కథ మహేశ్ కి బాగా నచ్చడంతో సరిలేరు నీకెవ్వరూ తర్వాత మళ్లీ ఈ కాంబో ఉంటుందని చెప్తున్నారు. అయితే వీళ్లిద్దరితో పాటూ హీరోయిన్ కృతిశెట్టి కలవనుందని టాక్. ఇప్పటికే అనిల్ రావిపూడి కథకు తగ్గ ప్లాన్ అమలు చేస్తున్నాడని, కృతిని కూడా మహేశ్ సరసన ఫైనల్ చేసినట్టేనని వార్తలొస్తున్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ షూటింగ్ మొదలెట్టాడు హీరో సుధీర్‌ బాబు. ఆ అమ్మాయి ఎవరో కాదు హీరోయిన్ కృతి శెట్టి. అవును సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తోన్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ గురువారం షురూ అయినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు సుధీర్‌. ‘మరోసారి డైరెక్టర్ మోహన్‌ కృష్ణ గారితో కలిసి పని చేస్తుండటం చాలా హ్యాపీగా ఉంది’ అని తెలియజేసారు‌. ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత సుధీర్‌ బాబు- మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ సినిమా ఇది. బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ కు వివేక్‌ సాగర్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇదిలాఉంటే ఆల్రెడీ ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ అనే క్రేజీ మూవీలో నటిస్తున్నాడు సుధీర్‌. దీనికి డైరెక్టర్ కరుణ కుమార్‌. కృతిశెట్టి విషయానికొస్తే.. నాని, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కుతున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో పాటూ హీరో రామ్‌- డైరెక్టర్ లింగుస్వామి కలయికలో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తోంది.

నాని నటిస్తోన్న పీరియాడికల్ ఫిల్మ్ శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం నాని, సాయి పల్లవిలపై సన్నివేశాలను తాళ్లపూడిలోని గోదావరి తీరాన చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఇందులో నానితో పాటూ మరో హీరో రాహుల్ రవీంద్రన్ కనిపించబోతున్నాడు. అయితే కథను మలుపు తిప్పే సహాయక పాత్రలో నటిస్తున్నాడు రాహుల్. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ రవీంద్రన్ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసాడు.

కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని అపురూప ప్రేమకథా చిత్రంగా మలుస్తున్నారు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్. సాయి పల్లవితో పాటూ కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈమధ్యే శ్యామ్ సింగ రాయ్ గా కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు నాని. మరి రాహుల్ పాత్రను ఎలా చిత్రీకరిస్తున్నారో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.

మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్‌ తేజ్ న‌టించిన ఫస్ట్ మూవీ ‘ఉప్పెన’ సూప‌ర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మూవీ యూనిట్ తాజాగా విజయోత్సవ సంబ‌రాలు చేసుకుంది. హైదరాబాద్‌లో జ‌రిగిన ఈ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున పాల్గొన‌డంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు అల్లు అర్జున్‌, సాయి‌ తేజ్‌, సుకుమార్ ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, మరికొందరు సెలబ్రిటీస్ సైతం ఇందులో పాల్గొన్నారు.

Image
ImageImageImage

జాతి రత్నాలు సినిమా క్లైమాక్స్ లో విజయ దేవరకొండ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇప్పుడలానే నాని కోసం కూడా విజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని టాక్.

దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని చేస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని సమాచారం. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఈ క్యారెక్టర్ కథను మలుపు తిప్పే అద్భుతమైన రోల్ అని చెప్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ పీరియాడిక్ మూవీ కావడంతో విజయ్ రోల్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాహుల్, రౌడీ బాయ్ కాంబోలో టాక్సీవాలా వచ్చింది. ఈ స్నేహంతోనే రాహుల్ అడగ్గానే ఒక చెప్పాడట విజయ్. అలాగే నానితో కూడా మంచి ర్యాపో వుంది విజయ్ కి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

తొలి సినిమాతోనే 100కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించిన మెగాఫ్యామిలీ స్టార్ పంజా వైష్ణవ్ తేజ్…వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ కాంబినేషన్లో చేస్తోన్న మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అంతేకాదు వైష్ణవ్‌ తన మూడో చిత్రానికి కూడా సంతకం చేశాడాని సమాచారం. మనం ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కొత్త డైరెక్టర్ తో..ఈ హీరో నెక్ట్స్ సినిమా పట్టాలెక్కనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇవే కాదు ప్రొడ్యూసర్ బీవీ ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించే మరో చిత్రానికి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇలా వరుస కమిటెమెంట్లతో వైష్ణవ్ ఓ పక్క బిజీగా మారుతుంటే…మరోవైపు ఈ మూవీ డైరెక్టర్, కథానాయిక కృతి శెట్టిని కూడా క్రేజీ దర్శకనిర్మాతలు సంప్రదిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

రోజురోజుకీ పెరుగుతున్న కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది ఉప్పెన చిత్రం. తాజాగా ఈ సినిమాను నంద‌మూరి బాల‌కృష్ణ త‌న కుటుంబంతో క‌లిసి వీక్షించారు. డైరెక్టర్ బుచ్చిబాబు కోరిక మేరకు ఉప్పెన చూసిన బాలయ్యబాబు… సినిమా చాలా బాగుంద‌ని చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారు. డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి బాలకృష్ణ దిగిన ఫోటో వైరల్ గా మారింది.

మరోవైపు ఉప్పెన టీమ్ కు కానుకలు అందిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. నిన్ననే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కి ఓ లేఖతో పాటూ గిఫ్ట్ పంపిన మెగాస్టార్…తాజాగా కృతిశెట్టిని సైతం ప్రశంసిస్తూ గిఫ్ట్ సెండ్ చేసారు. ఈ ఇద్దరూ కూడా మెగా కానుక నిజంగా అదృష్టమని భావిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తంచేసారు. అయితే దాదాపు ఉప్పెన టీమ్ మొత్తానికి మెగాస్టార్ ప్రశంసల కానుకలు పంపిస్తున్నట్టు తెలుస్తోంది.

టీటౌన్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్, డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్లో ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా హైద‌రాబాద్‌లో ఈ సినిమా ప్రారంభ పూజా కార్య‌క్ర‌మాలు సైతం జ‌రిగాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. రీసెంట్ హిట్ ఉప్పెన మూవీతో తెలుగు అడ్డాపై జెండా పాతిన కృతిశెట్టి..రామ్‌ సరసన న‌టించ‌బోతున్నట్టు టాక్ ప్రచారంలోకి వచ్చింది. రామ్ కి తగ్గట్టు స్టైలిష్ ఎలిమెంట్స్ తో ఉంటూనే ఊర‌మాస్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట లింగుస్వామి.
తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఈ ప్రాజెక్ట్ రూపొందనుండగా..కృతిశెట్టి ఈ మూవీతోనే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే కృతిశెట్టి ఎంపికపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ తో ప్రాజెక్ట్ చేస్తోన్న డైరెక్టర్ లింగుస్వామి… పందెంకోడి, ఆవారా, వెట్టయ్ వంటి సినిమాలతో పేరుతెచ్చుకుంటే…ఈ సినిమా నిర్మాత శ్రీనివాస చిట్టూరి యూట‌ర్న్‌, బ్లాక్ రోజ్‌, సీటీమార్ వంటి వాటితో లైమ్ లైట్ లోకి వచ్చారు.

ఉప్పెన సినిమా టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అవ్వడంతో.. తమిళ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఈ మూవీ రీమేక్ హక్కులు విజయ్ సేతుపతి దక్కించుకున్నారు. అయితే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు సంజయ్ ను ఈ మూవీతో పరిచయం చేయాలని చూస్తున్నారు. ఇక సేం తెలుగులో చేసిన విలన్ రోల్ లోనే విజయ్ సేతుపతి కనిపించనున్నారు.

కలెక్షన్ల విషయంలో.. ఇప్పటికే 50 కోట్ల మార్క్ ను దాటేసింది ఉప్పెన సినిమా. రోజు రోజుకి సినిమా కు రెస్పాన్స్ పెరిగిపోతోంది. ఈ రెండు రోజుల్లోనే ఉప్పెన 60 కోట్ల మార్క్ ను దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న ఉప్పెన సినిమా టీమ్ విజయోత్సవాలు చేయబోతున్నారు. 17న రాజమండ్రిలో సక్సెస్ మీట్ తో పాటు సంబరాలు చేయబోతున్నారు. ఈ వేడుకలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు ప్రకటించారు.