ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‘ఆదిపురుష్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. శ్రీరామ నవమి పండగ సందర్భంగా వచ్చే నెల ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో మూవీ యూనిట్ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. శ్రీరాముని జన్మదినం, పెళ్లిరోజు శుభముహూర్తన ఆ రాముడిగా ఆదిపురుష్ అవతారంలో కనిపించేందుకు సిద్ధమయ్యాడు ప్రభాస్.

కృతీ సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా ఫైనల్ అయినట్టే. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా…ఆయన భార్యగా మండోదరి పాత్రలో సీనియర్ హీరోయిన్ కాజోల్ కనిపించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది ఆదిపురుష్. ఇక ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఏదైనా అప్డేట్ చెప్పండయ్యా బాబు…అంటూ ప్రభాస్ నటిస్తోన్న సినిమా దర్శకనిర్మాతలకు తెగ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి కానుకగా ఆదిపురుషుడి గెటప్ లో ప్రభాస్ లుక్ ను రివీల్ చేసేందుకు రెడీఅయ్యారు మేకర్స్.

బాలీవుడ్ లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతుంది కృతీసనన్. ఆదిపురుష్ లో సీతగా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కృతీ…ఇప్పుడు బుట్టబొమ్మగా నటించే ఛాన్స్ దక్కించుకుందని టాక్. తెలుగు అల వైకుంఠపురంలో బుట్టబొమ్మలా పూజాహెగ్దే మెప్పిస్తే…ఈ మూవీ రీమేక్ హిందీ బుట్టబొమ్మగా కృతీ కనిపించనుందనే వార్త జోరందుకుంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా బాలీవుడ్లో రీమేక్‌ కానున్న సంగతి తెలిసిందే. కార్తీక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా…హీరో వరుణ్‌ ధావన్‌ బ్రదర్ రోహిత్‌ ధావన్‌ ఈ రీమేక్‌ ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులోనే హీరోయిన్ గా కృతీని అడిగినట్టు చెబుతున్నారు.
ప్రజెంట్ వరుణ్‌ ధావన్‌, కృతీ సనన్‌ జంటగా నటిస్తున్న హిందీ మూవీ ‘భేదియా’ ఏప్రిల్‌లో రిలీజ్ కాబోతుంది. మరోవైపు అక్షయ్‌ కుమార్‌ జోడీగా ‘బచ్చన్‌ పాండే’ సినిమాలో నటిస్తుంది కృతీ. ఇటీవలే ప్రభాస్‌ రామునిగా నటిస్తోన్న ప్యాన్‌ ఇండియా ఫిల్మ్ ‘ఆదిపురుష్‌’లో సీత పాత్రకు సెలెక్ట్ అయింది. ఇంత బిజీగా ఉంది కాబట్టే ఓసారి డైరీ తిరగేసి ‘అల వైకుంఠపురములో’ రీమేక్‌ మూవీకి డేట్స్‌ అడ్జస్ట్ చేయాలనుకుంటుందట. జూన్‌లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరి బుట్టబొమ్మగా కృతీనే చిందులేస్తుందా? వేరే హీరోయిన్ సీన్లోకి వస్తుందా? చూడాలి.

ప్రభాస్ రాముడిగా నటిస్తోన్న ఆదిపురుష్ కి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మొదటినుంచీ అనుకుంటున్న కృతి సనన్…సీతగా ఫిక్స్ అయింది. దాదాపు డైరెక్టర్ ఓం రౌత్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కృతి పేరే ప్రథమంగా వినిపించినా…మధ్యలో అనుష్క నుంచి కీర్తి సురేష్ వరకు సీతగా నటిస్తారని ప్రచారం జరిగింది. చివరికి కృతి నే..సీతగా చూపించబోతున్నాడు.

ఇక లక్షణుడుగా సన్నీ సింగ్ నటిస్తున్నాడు. సోను టిట్టు కె స్వీటీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సన్నీ…ఈ సినిమాలో ప్రభాస్ తమ్ముడుగా కనిపించబోతున్నాడు.

ప్రభాస్ ఆదిపురుష్ గురించి వార్త రాని రోజంటూ లేకుండా పోయింది. రామునిగా ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాలో సీతగా కృతిసనన్ అనీ, కీర్తి సురేశ్ అని రోజుకో ప్రచారం జరుగుతుంది. తాజాగా లక్ష్మణుడి గురించి అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ ఫేం విక్కీ కౌశల్ ప్రభాస్ తమ్మునిగా కనిపిస్తాడని అంటున్నారు. ఉరి..ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో మంచిపేరు తెచ్చుకున్నాడు విక్కీ. ప్రస్తుతం అశ్వద్ధామ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. కాగా ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా దాదాపు ఫిక్సయినట్టే అంటున్నారు. అంతకుముందు ఆదిపురుష్ కి సంబంధించి లక్ష్మణుడి పాత్రలో టైగర్ ష్రాఫ్ నటిస్తాడనే రూమర్ చక్కర్లు కొట్టింది.

బి టౌన్ స్టార్ హృతిక్ రోషన్, ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే వార్త జోరందుకుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాల దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ వీరిద్దరి కలయికలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వార్ తెరకెక్కించిన సిద్ధార్ధ్…ఇప్పుడు ప్రభాస్, హృతిక్ లను ఒకే ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాదు వీరిద్దరి మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను యష్ రాజ్ సంస్థ నిర్మించనుంది.

రీసెంట్ గా పెళ్లి చేసుకొని మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వరుణ్ ధావన్…ఇప్పుడు తోడేలుగా మారి భయపెడుతున్నాడు. అవును బాలీవుడ్‌ ఆడియెన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘భేదియా’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని హారర్‌ కామెడీ కథాంశంగా రూపొందించారు. వీళ్లిద్దరూ కలిసి నటిస్తోన్న రెండో సినిమా ఇది. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భేదియా మోషన్‌ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులోనే వరుణ్ తోడేలులా మారే క్రమాన్ని చూపించారు. కాగా ఈ ప్రాజెక్ట్ ను అమర్‌కౌశిక్‌ డైరెక్ట్ చేస్తున్నారు.

‘ఆదిపురుష్‌’ ప్రాజెక్ట్ ముహూర్తం షాట్ కి ముస్తాబవుతోంది. అతి త్వరలో రాధే శ్యామ్ అవతారాన్ని చాలించి రాముని మేకప్ వేసుకోనున్నారు ప్రభాస్‌. ఓం రౌత్‌ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్‌… రావణుడిగా సైఫ్‌ అలీఖాన్… సీతగా కృతీ సనన్‌ కనిపించనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఈ నెల 19 నుంచి నుంచి ప్రారంభం కానుంది. ముంబైలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ మొదలవుతుంది. సినిమా మొత్తాన్ని కూడా ఇదే స్టూడియోలో షూట్‌ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం నటిస్తోన్న లవ్ స్టొరీ ‘రాధే శ్యామ్‌’ను కంప్లీట్ చేసి, ‘ఆదిపురుష్‌’ సెట్లో అడుగుపెడతారట ప్రభాస్‌. ఈ మూవీ కోసం తన శరీరాకృతిని కూడా మార్చేశారు ప్రభాస్. 2022 ఆగస్ట్‌లో ‘ఆదిపురుష్‌’ని రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు