విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కళాపోషకులు’. ఈ చిత్రం ట్రైలర్ కి ట్రెమండస్ రిపోన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం టీమ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని కలిసి విషెస్ తీసుకున్నారు. కళాపోషకులు సినిమా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో విశ్వకార్తికేయ చాలా బాగా నటించాడు. ఫ్యూచర్ లో మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలి.. డైరెక్టర్ చలపతి పువ్వుల సినిమాని బాగా తీశాడని తెలిసింది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ సాధించింది. జనవరిలోనే ఈ చిత్రం రిలీజ్ కానుందని నిర్మాత సుధాకర్ రెడ్డి తెలిపారు.